రేవంత్ రెడ్డి బ్రదర్స్‌కు చిన్న చిన్న ఇంటి అడ్రస్‌తో పెద్ద పెద్ద కంపెనీలు : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి సోదరులు పెద్ద పెద్ద కంపెనీలకు ఓనర్లు అవుతున్నారని కేటీఆర్ విమర్శించారు. చిన్న ఇంటి అడ్రస్‌తో పెద్ద కంపెనీలను రిజిస్ట్రేషన్ చేయించారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాజకీయం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వివాదంతో తీవ్ర వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 1 లక్ష కేపిటల్ ఉన్న ఒక షెల్ కంపెనీకి కట్టబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ వ్యవహారాన్ని తొలుత బయటపెట్టగా కేటీఆర్ విలేకరుల సమావేశంలో దీనిపై ఆధారాలను బయటపెట్టారు. పటాన్‌చెరులోని ఒక చిన్న ఇంటి చిరునామాతో నమోదైన 'టెస్సెరాక్ట్' సంస్థకు ఒక్క ఉద్యోగి కూడా లేరని కేటీఆర్ అన్నారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్ నంబర్‌గా 12345678 అని పొందుపరచడం ఈ సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు.
రూ. 200 కోట్ల విలువైన భూకేటాయింపులను ప్రారంభ మూలధనం కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉన్న అనామక సంస్థకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇది ఐదు ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సోదరుడు కొండల్ రెడ్డికి ఈ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కొండల్ రెడ్డి స్వయంగా తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారని ఆధారాలు చూపించారు.
అంతేకాకుండా యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెస్సెరాక్ట్ చైర్మన్‌గా కొండల్ రెడ్డికి లభించిన ఆహ్వానాలు, వీరి ఏరోస్పేస్ కంపెనీ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ హాజరు కావడం వంటి విషయాలను కేటీఆర్ ప్రస్తావించారు.
సొంత శాఖలో జరుగుతున్న అక్రమాలపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కనీస అవగాహన ఉందా అని కేటీఆర్ నిలదీశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను గుడ్డిగా చదవడం మాని, కొండల్ రెడ్డి బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్న వాస్తవాలను గుర్తించాలని హితవు పలికారు.
గతంలో రేవంత్ రెడ్డి సోదరులు, బావమరిది కంపెనీలకు అమృత్ పథకంలో కాంట్రాక్టులు ఇచ్చారనే విమర్శలు ఉండగా, ఇప్పుడు టెస్సెరాక్ట్ పేరుతో కొత్త భూముల కేటాయింపు స్కామ్ బయటపడటం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ భూకేటాయింపుపై పారదర్శకమైన విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


