ఆగస్టు 14న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. భూ సమీకరణ విధానం, సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు!

Telangana Cabinet Meeting : ఆగస్టు 14వ తేదీన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం.

Published on: Aug 11, 2026, 20:47:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 14న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నూతన ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) విధానం, సంక్షేమ పథకాల పరిధి పెంపు, అలాగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై క్యాబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుంది.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

నిర్బంధ భూసేకరణ పద్ధతికి స్వస్తి పలుకుతూ, స్థానిక భూ యజమానులకు భాగస్వామ్యం కల్పించేలా కొత్త ల్యాండ్ పూలింగ్ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ విధానం కింద భూమి ఇచ్చిన యజమానులకు అభివృద్ధి చేసిన భూమిలో 60 శాతాన్ని తిరిగి కేటాయిస్తారు.

మిగిలిన 40 శాతం భూమిని హెచ్‌ఎండీఏ, టీజీఐసీసీ వంటి ప్రభుత్వ సంస్థలు తమ అధీనంలో ఉంచుకుంటాయి. ప్రభుత్వం తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించడం ద్వారా నిధులను సమీకరించి, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగిస్తుంది.

లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న కనీస వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ ప్రభుత్వం తీర్మానం చేయనుంది. అలాగే రాజ్యసభ, శాసనమండలి స్థానాలకు పోటీ వయస్సును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 10 వరకు లండన్, అమెరికా, చైనా, జర్మనీ దేశాల్లో మూడు వారాల పాటు విదేశీ పర్యటన చేయనున్న దృష్ట్యా ఈ ప్రత్యేక సమావేశాలను ఆగస్టు 17 లేదా 18 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాల పరిధిని పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 41 లక్షల మందికి నెలవారీ పింఛన్లు అందుతుండగా, కొత్తగా మరో 2.25 లక్షల మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేయనున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకాన్ని అదనంగా మరొక 3 నుండి 4 లక్షల కుటుంబాలకు వర్తింపజేయనున్నారు.

రూ.500లకే సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ఇచ్చే మహాలక్ష్మి పథకం పరిధిలోకి మరో 5 లక్షల కుటుంబాలను తీసుకురానున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో నివసించే అల్పదాయ వర్గాల కోసం ఇందిరమ్మ టవర్స్ పేరిట ప్లాట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవనం, గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More