అతిపెద్ద కుంభమేళ జాతరగా పేరొందిన మేడారం వేదికగా మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న భేటీ కాబోతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వలు జారీ అయ్యాయి.

ఈనెల 18వ తేదీన మేడారంలోని హారిత హోటల్ లో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేడారం జాతర వేళ… కేబినెట్ భేటీ విశేషంగా మారింది.
ఇక సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంటోంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అది కూడా కోట్లాది మంది భక్తులు అత్యంత విశ్వసించే మేడారం గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ కాకుండా ఓ మారుమూల గ్రామంలో కేబినెట్ భేటీ కావటం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.
ఇక మేడారంలో జరగబోయే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేడారంలో శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగానే నిధులు కేటాయించారు. అయితే కేబినెట్ భేటీలో మరిన్ని నిధులపై ప్రకటన ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా ఉంటుంది. అంతేకాకుండా రైతు భోరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం, మున్సిపల్ ఎన్నికలతో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఈ నెల 28న ప్రారంభం కానున్న సమ్మక్క - సారక్క మహా జాతర ప్రారంభమై… 31వ తేదీన ముగుస్తుంది. ఇక ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వెళ్తారు. 19న ఉదయం పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారు.
ఇదే తొలిసారి - మంత్రి పొంగులేటి
{{/usCountry}}మరోవైపు ఈ నెల 28న ప్రారంభం కానున్న సమ్మక్క - సారక్క మహా జాతర ప్రారంభమై… 31వ తేదీన ముగుస్తుంది. ఇక ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వెళ్తారు. 19న ఉదయం పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారు.
ఇదే తొలిసారి - మంత్రి పొంగులేటి
{{/usCountry}}రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ మీటింగ్) నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. "గత ప్రభుత్వంలా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం మా అలవాటు కాదు.. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేసే ప్రభుత్వమిది" అని స్పష్టం చేశారు.
సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.