ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న "1980ల నాటి లుక్" ట్రెండ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భాగమయ్యారు. గురువారం రోజున ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో తన ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత వింటేజ్ ఫోటోను పంచుకున్నారు. "జాయినింగ్ 80స్ ట్రెండ్" (Joining 80s trend) అనే క్యాప్షన్‌తో ఆయన ఈ పోస్ట్‌ను నెటిజన్లతో పంచుకున్నారు.

ఈ చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి 1980ల నాటి క్లాసిక్ మోటార్ బైక్‌పై చాలా సాధారణంగా ఆనుకుని నిలబడి కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ కాలం నాటి పాత సినిమా పోస్టర్లు, వింటేజ్ వాతావరణం పాత రోజులను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. ఈ లుక్ కోసం ఆయన ఆఫ్-వైట్ షర్ట్, ఖాకీ ప్యాంట్, బ్రౌన్ కలర్ కోట్ ధరించి కనిపించారు. ఒక చేతిని కోట్ జేబులో ఉంచుకుని, మరొక చేతిని బైక్‌పై ఉంచి నవ్వుతూ ఉన్న ఆయన శైలి అభిమానులను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో వైరల్…
ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వేలాది లైకులు, కామెంట్లతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రేవంత్ రెడ్డి అభిమానులు, వైఆర్సీపీ మరియు కాంగ్రెస్ శ్రేణులు, సాధారణ నెటిజన్లు దీనిపై విస్తృతంగా స్పందిస్తున్నారు. "80ల నాటి లుక్... రేవంత్ అన్నా నీ ఆరా వేరు!" అని ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు కామెంట్ చేయగా…. మరికొందరు ఆయన స్టైల్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా, ఈ 80ల నాటి ఏఐ ట్రెండ్ దేశవ్యాప్తంగా రాజకీయ, రంగుల ప్రపంచానికి చెందిన ప్రముఖులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు వంటి పలువురు అగ్రనేతలు, ప్రముఖ వ్యక్తులు కూడా తమ ఏఐ వింటేజ్ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుని ఈ ట్రెండ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
{{/usCountry}}కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా, ఈ 80ల నాటి ఏఐ ట్రెండ్ దేశవ్యాప్తంగా రాజకీయ, రంగుల ప్రపంచానికి చెందిన ప్రముఖులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు వంటి పలువురు అగ్రనేతలు, ప్రముఖ వ్యక్తులు కూడా తమ ఏఐ వింటేజ్ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుని ఈ ట్రెండ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
{{/usCountry}}