CM Revanth Reddy US Visit Denied : సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్ - అనుమతి నిరాకరణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. క్లియరెన్స్ నిరాకరించడంతో సీఎం లండన్ పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్ తిరుగుపయనమవుతున్నారు.
CM Revanth Reddy US Visit Denied : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో ఈ పర్యటనకు క్లియరెన్స్ ఇవ్వలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపింది.

అనుమతి నిరాకరణ…
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లేలా ముందస్తు షెడ్యూల్ ఖరారైంది. లండన్ పర్యటన ముగించుకుని ఆగస్టు 30 నాటికి హైదరాబాద్ చేరుకోవాలని ఆయన భావించారు. అయితే కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో… అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లాల్సిన సీఎం… తన పర్యటనను రద్దు చేసుకుని ఆగస్టు 23నే లండన్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్, న్యూయార్క్‌లలో పర్యటించి హార్వర్డ్, ఎంఐటీ (MIT), నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రపంచ ప్రసిద్ధ విద్యాసంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సీఎం పర్యటన రద్దయినప్పటికీ…. ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు ఈ పర్యటనను కొనసాగించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా విద్యాసంస్థలు, భాగస్వామ్య సంస్థలతో ఒప్పందాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
"విద్య, నైపుణ్యాభివృద్ధి, యువత భవిష్యత్తు విషయాల్లో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం," అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుతం లండన్‌లో ఉన్న ముఖ్యమంత్రి తన ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. వీటితో పాటు బ్రిటన్‌లోని ప్రముఖ క్రీడా, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో కూడా చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు.
అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. రాజకీయ కోణంలో పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

