తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి ఎదురవుతున్న సరిహద్దు అనుమతుల చిక్కుముడులను విప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అన్ముల రేవంత్ రెడ్డి ముంబై చేరుకున్నారు.

ఇవాళ ఉదయం ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ వివాదమేంటి..?
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గోదావరి నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల పొరుగున ఉన్న మహారాష్ట్ర భూభాగాలు నీట మునిగే అవకాశం ఉండటంతో, ఆ రాష్ట్ర అధికారిక సమ్మతి తెలంగాణకు అత్యంత ఆవశ్యకంగా మారింది.
ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ ఎత్తు (FRL) విషయంలో రెండు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే సానుకూలత వ్యక్తం చేసింది. కానీ, ఉత్తర తెలంగాణ ప్రాంత సాగునీటి అవసరాలు పూర్తిగా నెరవేరాలంటే బ్యారేజ్ ఎత్తును 150 నుంచి 152 మీటర్ల వరకు పెంచాలని తెలంగాణ సర్కార్ గట్టిగా పట్టుబడుతోంది.
గ్రావిటీ ద్వారా నీరు..
బ్యారేజ్ ఎత్తును 152 మీటర్లుగా ఖరారు చేస్తే, అక్కడి నుంచి నేరుగా గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారానే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించడం సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల నీటిని ఎత్తిపోసేందుకు అయ్యే భారీ విద్యుత్ వినియోగంతో పాటు, పంపింగ్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల పథకం లక్ష్యాలను పునరుద్ధరించి.... ఉత్తర తెలంగాణ జిల్లాలకు సమృద్ధిగా సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
ఈ అంతర్రాష్ట్ర జల వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్ 29న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
{{/usCountry}}ఈ అంతర్రాష్ట్ర జల వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్ 29న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
{{/usCountry}}మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, క్లియరెన్సులు వచ్చేలా చొరవ చూపాలని కోరారు. 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజ్ నిర్మించేందుకు రెండు రాష్ట్రాల మధ్య త్వరితగతిన ఒప్పందం కుదిర్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇచ్చిన సూచనలు, సాంకేతిక నివేదికల ఆధారంగా ఇప్పుడు నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.