ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
రాజగోపాల్‌రెడ్డికి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్.. 23న ఏం జరగబోతోంది? వేటు తప్పదా, లేక బుజ్జగింపులా?
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆసక్తిగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే బుజ్జగిస్తారా? వేటు తప్పదా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. సొంత ప్రభుత్వ పనితీరుపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం(AICC) ఎట్టకేలకు రంగంలోకి దిగింది. ఢిల్లీ పెద్దల నుండి రాజగోపాల్‌రెడ్డికి నేరుగా ఫోన్ కాల్ రావడం, ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ సందీప్‌తో సమావేశం కావాలని ఏఐసీసీ కార్యదర్శి ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు క్రమశిక్షణ చర్యలపై ఏఐసీసీ స్పందిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సంకేతాలివ్వడంతో రాజగోపాల్‌రెడ్డిపై వేటు పడుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

గత కొన్ని రోజులుగా సొంత ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. 'అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో అవినీతికి పాల్పడే, ప్రజావసరాలను విస్మరించి పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నటికీ క్షమించదు.' అంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించినవేనన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది.
ఇటీవల మంత్రివర్గ విస్తరణ, నియోజకవర్గ నిధుల కేటాయింపు, పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత వంటి అంశాలపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తోంది. పార్టీ గీత దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ ముఖ్యమని సీఎం సన్నిహితులు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య సాగిన మాటల యుద్ధం ఇప్పుడు ఢిల్లీ చేరింది.
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. 'కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువైంది. అందుకే కొందరు నేతలు బహిరంగంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఏఐసీసీ నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీ నియమావళిని ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంలో ఏఐసీసీ త్వరలోనే స్పందిస్తుంది.' అని స్పష్టం చేశారు.
ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ సందీప్‌తో జరగనున్న రాజగోపాల్‌రెడ్డి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం, అధిష్ఠానం ముందు ప్రధానంగా రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేనే స్వయంగా అవినీతి పాలన అంటూ విమర్శించడం ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఆయుధంగా మారుతోంది. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షిస్తే మిగతా అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా గళం విప్పే ప్రమాదం ఉంది. అందుకే ఇతర నేతలకు గట్టి హెచ్చరిక పంపేందుకు రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వడం లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కోమటిరెడ్డి సోదరులకు నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన పట్టు ఉంది. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ పార్టీకి కీలకం. పైగా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చూసుకోవాలంటే అసంతృప్త నేతలను పిలిచి మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలని అధిష్ఠానం భావించవచ్చు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన మనసులోని మాటను నిర్మొహమాటంగా, బహిరంగంగా చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేశారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుండి మంత్రి పదవి ఆశిస్తున్న ఆయన, తనకు ఆశించిన ప్రాధాన్యత దక్కకపోవడంతోనే ఇలా స్వరం వినిపిస్తున్నారు.

E-Paper
