హైదరాబాద్ నగరవాసులకు ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే 'జాయింట్ పాస్' విధానాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

నగర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సౌకర్యవంతంగా రోజువారీ , నెలవారీ (Monthly) పాస్‌లు జారీ చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ (HMRL), టీజీఎస్‌ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ విభాగాల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి, రెండో విడత హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుల్లో భాగంగా ఇప్పటివరకు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండి బి. అజిత్ రెడ్డి, జాయింట్ ఎండి శివేంద్ర ప్రతాప్‌లు సీఎస్‌కు వివరంగా వివరించారు.
పాతబస్తీ మెట్రో పనులపై సమీక్ష…
పాతబస్తీ మెట్రో కారిడార్ రోడ్డు వెడల్పు పనుల ప్రస్తుత పురోగతిపై సీఎస్ సంజయ్ జాజు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జనరల్ కన్సల్టెంట్‌ను నియమించేందుకు జరుగుతున్న టెండర్ల ప్రక్రియ ఏ దశలో ఉందో అధికారులు సీఎస్‌కు నివేదించారు. దాదాపు 7.5 కిలోమీటర్ల మేర ఉన్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను పరుగులు పెట్టించాలని, ప్రాజెక్టు క్షేత్రస్థాయి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎస్ ఆదేశించారు.
మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు ఉమ్మడి పాస్ ఇచ్చేందుకు సాంకేతికంగా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్, టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు సీఎస్‌కు తెలియజేశారు. ఎప్పుడైనా దీనిని అమలు చేయడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఉమ్మడి ఛార్జీల విధానాన్ని వీలైనంత త్వరగా ఆమోదించి, పాస్ వ్యవస్థను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని సీఎస్ స్పష్టం చేశారు.
మెట్రోలో ప్రయాణించిన ప్రధాన కార్యదర్శి…
{{/usCountry}}మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు ఉమ్మడి పాస్ ఇచ్చేందుకు సాంకేతికంగా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్, టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు సీఎస్‌కు తెలియజేశారు. ఎప్పుడైనా దీనిని అమలు చేయడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఉమ్మడి ఛార్జీల విధానాన్ని వీలైనంత త్వరగా ఆమోదించి, పాస్ వ్యవస్థను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని సీఎస్ స్పష్టం చేశారు.
మెట్రోలో ప్రయాణించిన ప్రధాన కార్యదర్శి…
{{/usCountry}}సమీక్షా సమావేశం అనంతరం సీఎస్ సంజయ్ జాజు బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రో రైలులో స్వయంగా ప్రయాణించారు. ఆయనతో పాటు హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండి బి. అజిత్ రెడ్డి కూడా ప్రయాణించారు. స్టేషన్లలోని వాణిజ్య సముదాయాలు, పార్కింగ్ స్థలాలను స్వయంగా పరిశీలించారు. టి అభివృద్ధికి సంబంధించి పలు విలువైన సూచనలు చేశారు. అనంతరం ఎన్‌హెచ్-44పై హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా సీఎస్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.