TG D Pharmacy Admissions : డీ -ఫార్మసీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల… దరఖాస్తు గడువు, పూర్తి వివరాలు!
Telangana D Pharmacy Admission Notification 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో రెండేళ్ల డీ-ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Telangana D Pharmacy Admission Notification 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీ-ఫార్మసీ) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) వెల్లడించింది.అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించవచ్చు.

ముఖ్య తేదీలు…
- సాధారణ రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 6, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- రూ.100 ఆలస్య రుసుముతో చివరి తేదీ: ఆగస్టు 7, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- మెరిట్ జాబితా / ర్యాంకుల ప్రకటన: ఆగస్టు 11, 2026
- కౌన్సెలింగ్ తేదీలు: ఆగస్టు 13 మరియు 14, 2026
అభ్యర్థులు దరఖాస్తులను పూరించి, అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్, ఫీజు రశీదుతో కలిసి హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌కు స్వయంగా గానీ లేదా నిర్ణీత కేంద్రాల్లో గానీ అందజేయాల్సి ఉంటుంది. ఆగస్టు 13, 14 తేదీల్లో ఉదయం 9:00 గంటలకు మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు ప్రత్యక్షంగా హాజరుకావడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.
- ఈ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ (MPC) లేదా బైపీసీ (BiPC) గ్రూప్‌లలో ఉత్తీర్ణులై ఉండాలి.
- సీబీఎస్ఈ (CBSE), ఐసీఎస్ఈ (ICSE) బోర్డుల నుంచి 12వ తరగతి పూర్తి చేసిన వారు, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) గుర్తింపు పొందిన సమానమైన కోర్సులు లేదా ఓపెన్ స్కూల్ విధానంలో ఉత్తీర్ణులైన వారు కూడా ప్రవేశాలకు అర్హులే.
- ఎంఎల్టీ (MLT) వృత్తి విద్యా కోర్సులు, బ్రిడ్జి కోర్సులు చేసిన వారికి PCI నిబంధనల ప్రకారం ప్రవేశ అర్హత లేదని స్పష్టం చేశారు.
దరఖాస్తు రుసుముగా ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులు రూ.300, ఇతర వర్గాల అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో వార్షిక ట్యూషన్ ఫీజు రూ.2,000 కాగా, ఇతర డిపాజిట్లు, డెవలప్‌మెంట్ ఫీజులు కలిపి మొత్తం ఫీజు రూ.5,080గా నిర్ణయించారు. అదేవిధంగా ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజు రూ.16,400 మరియు ఇతర రుసుములు కలిపి మొత్తం రూ.18,280గా నిర్ణయించినట్లు అధికారులు ప్రకటించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

