TG DOST 2026 Updates : ఇవాళ 'దోస్త్' ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
Telangana DOST Seat Allotment 2026 : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ (DOST) ప్రాసెస్ కొనసాగుతోంది. ఇప్పటికే వెబ్ ఆప్షన్లు కూడా పూర్తి కాగా... ఇవాళే మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు వారి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.
Telangana DOST Seat Allotment 2026 : ఇంటర్మీడియట్ పూర్తి చేసి, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ దోస్త్ మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం వేల సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.

దోస్త్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా:
సీటు పొందిన విద్యార్థులు తమ వివరాలను తెలుసుకోవడానికి దోస్త్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
- విద్యార్థులు మొదటగా https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
- అక్కడ అందుబాటులో ఉన్న 'Allotment Order' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ దోస్త్ ఐడీ వివరాలతో లాగిన్ కావాలి.
- మీకు సీటు ఖరారు అయితే అలాట్‌మెంట్ లెటర్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందొచ్చు.
సీటు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా 'సెల్ఫ్ రిపోర్టింగ్' ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. ఈ ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు…మే 15 నుండి మే 23 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము చెల్లించి సీటును రిజర్వ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేసిన తర్వాతే మీ సీటు ఖరారవుతుంది. లేనిపక్షంలో ఆ సీటు తదుపరి విడత కౌన్సెలింగ్‌లో ఇతరులకు కేటాయించబడుతుంది.
రెండో దశ దోస్త్ రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి మే 25 వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్లు మే 26 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ దశకు సీట్ల కేటాయింపు మే 30న జరగనుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ మే 31 నుండి జూన్ 5 వరకు జరుగుతుంది.
ఫేజ్ 3 రిజిస్ట్రేషన్లు మే 31 నుండి జూన్ 15 వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్లు జూన్ 16 వరకు అందుబాటులో ఉంటాయి. తుది సీట్ల కేటాయింపును జూన్ 20న విడుదల చేస్తారు. అభ్యర్థులు జూన్ 20 నుండి జూన్ 25 మధ్య ఆన్‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు షెడ్యూల్‌ను జాగ్రత్తగా ఫాలో కావాలి. నిర్దేశించిన కాలపరిమితిలోగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: దోస్త్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీ ఎక్కడ లభిస్తుంది?
జవాబు: అభ్యర్థులు https://dost.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ అలాట్‌మెంట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రశ్న: సీటు వచ్చిన తర్వాత ఏం చేయాలి?
జవాబు: సీటు కేటాయించిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాతే నిర్ణీత తేదీల్లో కళాశాలకు వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ప్రశ్న: మొదటి విడతలో సీటు రాకపోతే ఏం చేయాలి?
జవాబు: మొదటి విడతలో సీటు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు దోస్త్ ఫేజ్-2 కౌన్సెలింగ్‌లో మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

