...
...
Next Story

Private Schools Fee : ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల వివరాలు డిస్‌ప్లే చేయాల్సిందే - విద్యాశాఖ ఆదేశాలు

Private Schools Fee Structure Display : ప్రైవేట్ పాఠశాలలు 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి తరగతుల వారీగా వసూలు చేసే ఫీజు వివరాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. నోటీస్ బోర్డు, వెబ్‌సైట్లలో కచ్చితంగా ఫీజుల వివరాలను ప్రదర్శించాలని స్పష్టం చేసింది.

Published on: Aug 8, 2026, 13:13:30 IST
Advertisement

రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజు వివరాలను వెంటనే నోటీస్ బోర్డుల్లో, పాఠశాల అధికారిక వెబ్‌సైట్లతో పాటు విద్యాశాఖ పోర్టల్‌లో బహిరంగంగా ప్రదర్శించాలని ప్రైవేట్ యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

ఫీజు వివరాలు చెప్పాల్సిందే…

ప్రైవేట్ పాఠశాలలు - ఫీజులపై కీలక ఆదేశాలు
ప్రైవేట్ పాఠశాలలు - ఫీజులపై కీలక ఆదేశాలు

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని అన్ని ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ విద్యాసంస్థలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆయన కోరారు. స్కూల్ నోటీస్ బోర్డు, సొంత వెబ్‌సైట్‌తో పాటు విద్యాశాఖకు చెందిన అధికారిక పోర్టల్ "schooledu.telangana.gov.in" లో ఫీజుల సమగ్ర వివరాలను పొందుపరచాలని స్పష్టం చేశారు.

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ ఫీజుల నిర్మాణాన్ని సులభంగా అప్‌లోడ్ చేసేందుకు వీలుగా "schooledu.telangana.gov.in" పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించి పాఠశాల విద్యా ప్రాంతీయ విభాగాధికారులు (RJD), జిల్లా విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నవీన్ నికోలస్ సూచించారు.

1994లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల నిబంధనలకు అనుగుణంగా…. 2026-27 విద్యాసంవత్సరానికి నిర్ణయించిన తరగతుల వారీ ఫీజుకు సంబంధించి స్కూల్ గవర్నింగ్ బాడీ సభ్యులు సంతకం చేసిన పత్రాలను కూడా వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా నోటీస్ బోర్డుల్లో లేదా వెబ్‌సైట్లలో ఫీజుల వివరాలను ప్రదర్శించని పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ హెచ్చరించింది. ఆదేశాలు ఉల్లంఘించిన విద్యాసంస్థలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని…. జీవో నిబంధనల ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌జేడీలు, డిఈఓలను ఆదేశించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks