తెలంగాణ నుండి భౌగోళిక గుర్తింపు(GI) పొందిన తాండూర్ కందులు మొదటి సరుకును తెలంగాణలోని హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియాకు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన అగ్రికల్చరల్, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ(APEDA) సహకారంతో ఈ కార్యక్రమం సులభతరం అయింది.

రాష్ట్రం నుండి భౌగోళిక గుర్తింపు (GI) రిజిస్ట్రేషన్ పొందిన మొదటి వ్యవసాయ ఉత్పత్తి తాండూర్ కందిపప్పు. ధాన్యాల కంటే ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం, ఈ ఎగుమతి సరుకు కొత్త విదేశీ మార్కెట్లను అన్వేషించడానికి, రైతులు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు అవకాశాలను విస్తరించడానికి ఒక ముందడుగుగా చెప్పవచ్చు.
2.5 మెట్రిక్ టన్నుల ఈ సరుకును వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్‌లోని APEDA ఏజీఎం ఆర్. పి. నాయుడు వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.
తాండూర్ ప్రాంతంలోని తాండూర్, బషీరాబాద్, పెద్దెముల్, యాలాల అనే నాలుగు మండలాలలోని వర్షాధార భూములలో తాండూర్ కందిని ప్రధానంగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలోని సారవంతమైన లోతైన నల్లరేగడి నేలలు, బంకమట్టి ఖనిజ నిక్షేపాలు, గణనీయమైన సున్నపురాయి నిక్షేపాలు ఉండటం తాండూర్ కందులకు ప్రత్యేక లక్షణాలకు కారణం.
తాండూర్ మండలం, కాతల్‌పూర్‌కు చెందిన ఈ ధాన్యాన్ని పండించే రైతు బుదేలి సైలు మాట్లాడుతూ.. ఇతర జిల్లాల్లో, రాష్ట్రాల్లో దీనికి గిరాకీ ఉందని చెప్పారు. ఆయన తన పొలంలోని ప్రస్తుత కంది పంటను రెండు నెలల్లో కోయనున్నారు. సాధారణంగా ఈ పంట కోతకు ఆరు నెలలు పడుతుంది అని సైలు తెలిపారు.
మొదటి విడతను హైదరాబాద్కు చెందిన మెస్సర్స్ దుర్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థ 'అమ్మాస్' బ్రాండ్ పేరుతో ఎగుమతి చేసింది. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిణి బి. కవిత, హైదరాబాద్ ప్రాంతీయ ప్రాధికార సంస్థ విదేశీ వాణిజ్య అదనపు డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.
{{/usCountry}}మొదటి విడతను హైదరాబాద్కు చెందిన మెస్సర్స్ దుర్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థ 'అమ్మాస్' బ్రాండ్ పేరుతో ఎగుమతి చేసింది. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిణి బి. కవిత, హైదరాబాద్ ప్రాంతీయ ప్రాధికార సంస్థ విదేశీ వాణిజ్య అదనపు డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.
{{/usCountry}}తాండూర్ కందుల్లో 22 నుంచి 24 శాతం వరకు ప్రోటీన్ ఉంటాయి. ధాన్యాల్లోని ప్రోటీన్ కంటే సుమారు మూడు రెట్లు ఎక్కువ అన్నమాట. రుచి, వంటకు అనుకూలంగా, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం వీటికి ఉంటుంది. జీఐ గుర్తింపుతో ఈ ఉత్పత్తికి ఎక్కువ ప్రాచుర్యం, మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది.