తొలిసరిగా ఆస్ట్రేలియాకు తాండూర్ కందులు.. వీటి ప్రత్యేకత ఇదే
భౌగోళిక గుర్తింపు పొందిన తాండూర్ కందులు మెుదటిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అయ్యాయి. హైదరాబాద్ నుంచి జెండా ఊపి తొలి సరకును పంపించారు.
తెలంగాణ నుండి భౌగోళిక గుర్తింపు(GI) పొందిన తాండూర్ కందులు మొదటి సరుకును తెలంగాణలోని హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియాకు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన అగ్రికల్చరల్, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ(APEDA) సహకారంతో ఈ కార్యక్రమం సులభతరం అయింది.

రాష్ట్రం నుండి భౌగోళిక గుర్తింపు (GI) రిజిస్ట్రేషన్ పొందిన మొదటి వ్యవసాయ ఉత్పత్తి తాండూర్ కందిపప్పు. ధాన్యాల కంటే ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం, ఈ ఎగుమతి సరుకు కొత్త విదేశీ మార్కెట్లను అన్వేషించడానికి, రైతులు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు అవకాశాలను విస్తరించడానికి ఒక ముందడుగుగా చెప్పవచ్చు.
2.5 మెట్రిక్ టన్నుల ఈ సరుకును వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్‌లోని APEDA ఏజీఎం ఆర్. పి. నాయుడు వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.
తాండూర్ ప్రాంతంలోని తాండూర్, బషీరాబాద్, పెద్దెముల్, యాలాల అనే నాలుగు మండలాలలోని వర్షాధార భూములలో తాండూర్ కందిని ప్రధానంగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలోని సారవంతమైన లోతైన నల్లరేగడి నేలలు, బంకమట్టి ఖనిజ నిక్షేపాలు, గణనీయమైన సున్నపురాయి నిక్షేపాలు ఉండటం తాండూర్ కందులకు ప్రత్యేక లక్షణాలకు కారణం.
తాండూర్ మండలం, కాతల్పూర్కు చెందిన ఈ ధాన్యాన్ని పండించే రైతు బుదేలి సైలు మాట్లాడుతూ.. ఇతర జిల్లాల్లో, రాష్ట్రాల్లో దీనికి గిరాకీ ఉందని చెప్పారు. ఆయన తన పొలంలోని ప్రస్తుత కంది పంటను రెండు నెలల్లో కోయనున్నారు. సాధారణంగా ఈ పంట కోతకు ఆరు నెలలు పడుతుంది అని సైలు తెలిపారు.
మొదటి విడతను హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ దుర్గా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థ 'అమ్మాస్' బ్రాండ్ పేరుతో ఎగుమతి చేసింది. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిణి బి. కవిత, హైదరాబాద్ ప్రాంతీయ ప్రాధికార సంస్థ విదేశీ వాణిజ్య అదనపు డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.
తాండూర్ కందుల్లో 22 నుంచి 24 శాతం వరకు ప్రోటీన్ ఉంటాయి. ధాన్యాల్లోని ప్రోటీన్ కంటే సుమారు మూడు రెట్లు ఎక్కువ అన్నమాట. రుచి, వంటకు అనుకూలంగా, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం వీటికి ఉంటుంది. జీఐ గుర్తింపుతో ఈ ఉత్పత్తికి ఎక్కువ ప్రాచుర్యం, మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


