...
...
Next Story

గ్రామ పంచాయతీ ఎన్నికలు : రిజర్వేషన్లపై కసరత్తు పూర్తి - బీసీ కోటాలో మార్పులు…!

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తును పూర్తి చేసింది. ఈనెల 26 లేదా 27వ తేదీన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Published on: Nov 22, 2025, 10:28:23 IST
Advertisement

రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. డెడికేటెడ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు 23 శాతం చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్‌ కమిషన్‌ ఒక నివేదికకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇప్పటికే పలువురు మంత్రులు సంతకాలు కూడా చేశారు.

పంచాయతీ ఎన్నికలు - రిజర్వేషన్లపై కసరత్తు పూర్తి
పంచాయతీ ఎన్నికలు - రిజర్వేషన్లపై కసరత్తు పూర్తి

ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు పంపించారు. దీని ప్రకారం మండల స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కసరత్తు పూర్తయింది.

బీసీ కోటాలో మార్పు….!

ఇవాళ బీసీ రిజర్వేషన్ల ఖరారు ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఆదివారం నాటికి ఆ జాబితాలను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి సమర్పిస్తారని తెలుస్తోంది. గతంలో 42 శాతం రిజర్వేషన్లతో కూడిన జీవో ఇవ్వగా… చాలా స్థానాల్లో బీసీలకు అవకాశం దక్కేది. కానీ ప్రస్తుతం 23 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించే పనిలో ఉండగా…… గతంలో ప్రకటించిన కోటాలో మార్పులుంటాయి. ఆయా చోట్ల జనరల్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ కోటాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మరోవైపు ఈనెల 24వ తేదీన హైకోర్టులో పంచాయతీ ఎన్నికలపై విచారణ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన కసరత్తు వివరాలను కూడా న్యాయస్థానం ముందు ఉంచనుంది.

3 దశల్లో ఎన్నికలు…!

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియ షురూ అయింది. ఈనెల 23 వరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఈనెల 23వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల ప్రచురణ ఉంటుంది.

ఇక రాష్ట్రంలో ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించి… ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే కసరత్తు చేస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe