గ్రామ పంచాయతీ ఎన్నికలపై కసరత్తు షురూ - డిసెంబర్ లో షెడ్యూల్...!
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు షెడ్యూల్ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఈనెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరోసారి రంగం సిద్ధమవుతోంది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లేందుకు సర్కార్ సిద్ధమవుతున్న నేపథ్యంలో…. ఈసీ కూడా స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు తాజాగానే షెడ్యూల్ కూడా ప్రకటించింది.

ఇవాళ్టి నుంచే సవరణ ప్రక్రియ….
ఇవాళ్టి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియ షురూ అయింది. ఈనెల 23 వరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఇవాళ ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణకు అవకాశం ఉండగా… ఈనెల 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుంది. ఇక ఈనెల 23వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుంది.
డిసెంబర్ లో ఎన్నికల షెడ్యూల్…!
డిసెంబరు రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని కేబినెట్ లో కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్ ఇచ్చి… అదే నెలాఖరులోపు గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసే వీలుంది.
ఈనెల 24న హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై మరోసారి విచారణ జరగనుంది. ఆ రోజు ప్రభుత్వ వైఖరిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి 2026 మార్చి 31తో ముగియనుంది. ఆలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామాలకు రావాల్సిన రూ.3 వేల కోట్ల ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబరులో ఎలాగైనా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని యోచిస్తోంది. బీసీ రిజర్వేషన్లను కూడా పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

