...
...
Next Story

Kaleshwaram Barrages : కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై సర్కార్ ఫోకస్ - ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్న బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని భావిస్తోంది. తాజాగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు

Published on: Apr 13, 2026, 08:20:48 IST
Advertisement

కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్షించి నిర్వహించి.. నిర్దేశించిన సమయంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఆదివారం అధికారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

స్టీరింగ్ కమిటీ….

కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై సర్కార్ ఫోకస్
కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై సర్కార్ ఫోకస్

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు నీటిపారుదల రంగ నిపుణుడు కర్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా కన్వీనర్‌గా స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచ‌న‌ల మేర‌కు వీలైనంత త్వరగా ఈ ప‌నుల‌ను వేగవంతం చేయాల‌న్నారు. ప్రాజెక్టు మ‌ర‌మ్మమతుల కోసం ప్రత్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి నిరంత‌రం పర్యవేక్షణ చేయాల‌ని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

మరమ్మత్తులకు సంబంధించిన ఏజెన్సీల‌న్నింటిని అప్రమత్తం చేసి ప‌నుల్లో వేగం పెంచాల‌ని సూచించారు. సెంట్రల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ స్టేష‌న్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, న‌మూనాల సేక‌ర‌ణను వ‌ర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల‌ని స్పష్టం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన మధ్యంతర నివేదిక మరియు సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, తక్షణ మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…. "బ్యారేజీల పునరుద్ధరణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. నిర్ణయించిన టైమ్ లైన్ ప్రకారమే పనులు పూర్తి చేసి, బ్యారేజీలను సిద్ధం చేయాలి" అని అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం పునరుద్ధరణ పనుల్లో భాగంగా…. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజిని అధ్యయనం చేయనున్నారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వడానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ సిద్ధమవుతోంది. ప్రత్యేకంగా మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయబోతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks