Telangana 22A Lands Issue : 22ఏ భూముల సమస్యలపై సర్కార్ ఫోకస్ - హైలెవల్ కమిటీ ఏర్పాటు

Telangana 22A Lands Issue : 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఉన్నతాధికారులతో హైలెవల్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Sep 18, 2026, 14:56:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana 22A Lands Issue : తెలంగాణలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఎంతోమంది ప్రజలను, రైతులలో గందరగోళానికి గురిచేస్తున్న 22ఏ (నిషేధిత భూముల జాబితా) సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో ఉన్న చిక్కుముళ్లను విప్పేందుకు వీలుగా ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి కమిటీని (హైలెవల్ కమిటీ) గురువారం ఏర్పాటు చేసింది.

22ఏ భూముల వివాదం - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
22ఏ భూముల వివాదం - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉన్నతాధికారులతో కమిటీ…

ముగ్గురు ఐఏఎస్, ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీ బాధ్యతలను స్వీకరించనుంది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా సీసీఎల్‌ఏ (భూపరిపాలన ప్రధాన కమిషనర్) వ్యవహరిస్తారు. కమిటీలో సభ్యులుగా రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీలు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని 22ఏ జాబితాలో చేర్చడం వల్ల లక్షలాది ఎకరాల భూములు కొనుగోళ్లు, అమ్మకాలకు నోచుకోక స్తంభించిపోయాయి. దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలు, ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌, అసైన్డ్‌ భూముల రక్షణ పేరిట సాధారణ పౌరుల భూములు కూడా ఈ నిషేధిత జాబితాలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొత్తగా ఏర్పాటైన ఈ ఉన్నతాధికారుల కమిటీ 22ఏ పరిధిలో ఉన్న భూములపై సమగ్రంగా విచారణ జరిపి…. నిజమైన యజమానులకు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి నివేదిక మరియు సిఫార్సులు సమర్పించనుంది. ఈ నిర్ణయంతో భూముల సమస్యలతో సతమతమవుతున్న వేలాది మంది భూయజమానులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More