HMWSSB Recruitment : హైదరాబాద్ జలమండలిలో 230 మేనేజర్ ఉద్యోగాలు - భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
HMWSSB Recruitment 2026 :హైదరాబాద్ జలమండలిలో ఖాళీగా ఉన్న 230 మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సేవల్లో జాప్యం కలగకుండా ఇతర శాఖల నుంచి డెప్యూటేషన్ ద్వారా ఇంజినీర్లను నియమించనున్నారు.
HMWSSB Recruitment 2026 :హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు జలమండలికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
230 మేనేజర్ పోస్టులు….
ఇందులో భాగంగా జలమండలిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న 100 పోస్టులతో పాటు, అదనంగా మరో 130 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ మొత్తం 230 మేనేజర్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ, నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు కొంత సమయం పడుతుంది. అయితే నగర ప్రజలకు అందించే అత్యవసర సేవల్లో ఎటువంటి అంతరాయం కలగవద్దని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే…. శాశ్వత నియామకాలు జరిగేలోపు తాత్కాలిక ఏర్పాట్లుగా ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. దీనివల్ల సాంకేతిక నైపుణ్యం కలిగిన అధికారులు తక్షణమే విధుల్లో చేరి ప్రాజెక్టులను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. ఇరిగేషన్ (నీటి పారుదల శాఖ), పంచాయతీ రాజ్, రోడ్లు మరియు భవనాల శాఖ, పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆయా శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు (AE), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారు జలమండలిలో మేనేజర్ హోదాలో పనిచేయడానికి అర్హులు.
- డిప్యూటేషన్ ద్వారా ఎంపికయ్యే అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా… నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది.
- నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడం.
- మురుగు నీటి నిర్వహణ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం.
- స్థానిక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం.
- ప్రస్తుతం కొనసాగుతున్న వాటర్ ప్రాజెక్టులు, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనుల నాణ్యతను తనిఖీ చేయడం.
పైన పేర్కొన్న శాఖల్లో పనిచేస్తూ…. జలమండలిలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న అధికారులు తమ సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా శాఖల ప్రధాన ఇంజనీర్లకుజలమండలి ఇప్పటికే అధికారిక లేఖలు పంపింది. ఆసక్తి గల అభ్యర్థులు తమ శాఖాధిపతుల ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తులను బోర్డుకు పంపాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

