...
...
Next Story

RevOne : రెవన్ పోర్టల్ తీసుకొస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇది ఎందుకో తెలుసా?

RevOne Portal : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవన్ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇది ఎందుకోసమో చూద్దాం..

Published on: Apr 6, 2026, 22:05:46 IST
Advertisement

పన్ను ఎగవేతదారులపై తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టింది. ఇకపై పన్ను ఎగవేతదారులను ఉపక్షించేది లేదని చెబుతోంది. ఇందులో భాగంగా కొత్త పోర్టల్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోంది. సీఎస్ నేతృత్వంలోని రెవెన్యూశాఖ విభాగాల కార్యదర్శులతో అధ్యయన కమిటీని నియమించింది.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

ఆదాయం తెచ్చే శాఖలు అన్నింటినీ కలిపి.. రేవన్(RevOne) పోర్టల్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతోంది. శాఖల మధ్య డేటా మార్పిడి, పర్యవేక్షణకు పోర్టల్‌ను రూపొందిస్తారు. స్థానిక సంస్థల వినోదపు పన్ను వసూలు, యూపీఐ, పీవోఎస్ లావాదేవీలపై నిఘా పెట్టేలా కొత్త చట్టం ఏర్పాటులాంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ అధ్యయనం చేసి రిపోర్టును సమగ్రంగా పొందుపరచనుంది. 30 రోజుల్లో ప్రాథమిక, 60 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. రైతులకు భూ భద్రత కల్పిస్తూ, సులభరతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల భూభారతి పోర్టల్ రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ నూతన ఇంటిగ్రేటెడ్ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.

ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి భూయజమానికి వారి భూమికి ప్రత్యేకంగా భూధార్ నంబర్‌ను కేటాయిస్తారు. భూమి వివరాల్లో పారదర్శకత పెరిగి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ​ఇకపై భూమి రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం డాక్యుమెంట్లు మాత్రమే కాదు, క్షేత్రస్థాయి కొలతలతో కూడిన మ్యాప్‌ను కూడ జత చేయడం జరుగుతుంది. అమ్మేవారి నుంచి కొనేవారికి భూమిని కొలిచి అప్పగించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది.

​పాతకాలపు గొలుసు పద్ధతులకు స్వస్తి పలికి, అంగుళం కూడా తేడా లేకుండా కొలతలు తీసే రోవర్ యంత్రాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందుకోసం 5300 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతి మండలానికి 6 నుంచి 7 మందిని కేటాయించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks