Venus Transit: ఏప్రిల్ నెలలో నాలుగు సార్లు శుక్ర సంచారంలో మార్పు.. మూడు రాశుల ఆదాయం పెరుగుతుంది, పదోన్నతులు!

శుక్రుడు ఎప్పటికప్పుడు తన సంచారంలో మార్పు చేస్తాడు. శుక్రుని సంచారంలో మార్పు వస్తే అది ప్రతి రాశిపై ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ నెలలో నాలుగు సార్లు శుక్రుని సంచారంలో మార్పు రానుంది. తులా రాశి, వృషభ రాశి, కుంభ రాశి వారు ఏప్రిల్ నెలలో అద్భుత లాభాలు పొందుతారు. ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. 

Published on: Apr 04, 2026 12:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డబ్బు, విలాసాలు, ప్రేమ, సంతోషం మొదలైన వాటికి కారకుడు శుక్రుడు. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అన్ని రాశుల వారిపై శుక్రుని మార్పుతో ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Venus Transit: ఏప్రిల్ నెలలో నాలుగు సార్లులో శుక్ర సంచారం మార్పు.. మూడు రాశుల ఆదాయం పెరుగుతుంది (pinterest)
Venus Transit: ఏప్రిల్ నెలలో నాలుగు సార్లులో శుక్ర సంచారం మార్పు.. మూడు రాశుల ఆదాయం పెరుగుతుంది (pinterest)

ఏప్రిల్ నెలలో చూసినట్లయితే, శుక్రుడు ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా నాలుగు సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. ఏప్రిల్ నెలలో శుక్ర సంచారంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? శుక్ర సంచారంలో మార్పు ఏ రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకు రాబోతుందో తెలుసుకుందాం.

ఏప్రిల్ నెలలో నాలుగు సార్లు శుక్రుడి సంచారంలో మార్పు

ఏప్రిల్ నెలలో శుక్రవారం చాలా విశేషమైనది. నాలుగు సార్లు శుక్రుడి రాశి సంచారంలో మార్పు ఉండటంతో అనేక విధాలుగా మార్పులు వస్తాయి. మొదట, ఏప్రిల్ 5న శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత, ఏప్రిల్ 16న శుక్రుడు కృత్తికా నక్షత్రంలోకి అడుగుపెడతాడు.

ఆ తర్వాత, ఏప్రిల్ 19న మధ్యాహ్నం 3:51కి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత, ఏప్రిల్ 27న రాత్రి 9:08కి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా శుక్రుడి సంచారంలో మార్పు ఉంటుంది. ఇది కొన్ని రాశుల వారికి ఊహించని విధాలుగా లాభాలను తీసుకొస్తుంది.

1.తులా రాశి:

తులా రాశి వారికి ఏప్రిల్ చాలా బాగుంటుంది. తులా రాశి వారు పెద్ద పెద్ద డీల్స్‌ను పొందుతారు. కెరీర్‌లో అద్భుతమైన మార్పులను చూస్తారు. వివిధ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతోషం, డబ్బు పెరుగుతాయి. తెల్లటి వస్తువులను దానం చేస్తే మరింత శుభ ఫలితాలను పొందవచ్చు.

2.వృషభ రాశి:

ఈ రాశి వారికి కూడా ఏప్రిల్ బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు, లాభాలను పొందుతారు. ఆనందంగా ఉంటారు. సంతోషం రెట్టింపు అవుతుంది. శుక్ర సంచారం ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలను తెస్తుంది.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబంతో ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More