...
...
Next Story

TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్​ ట్రస్ట్ - డేటా ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు..!

TG Employees Health Scheme : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 'ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్' (EHS) తీసుకురానుంది. ఈ స్కీమ్ అమలుపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు లబ్ధిదారుల డేటా అప్‌లోడ్‌కు ఇవాళే(మే 31) చివరి తేదీ.

Published on: May 31, 2026, 13:32:27 IST
Advertisement

TG Employee Health Care Trust : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)ను పక్కాగా…. పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్​ ట్రస్ట్ - డేటా ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు..!
ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్​ ట్రస్ట్ - డేటా ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు..!

ఈ నూతన ఆరోగ్య భద్రత పథకం అమలు తీరు, కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉద్యోగులకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సమీక్ష సాగనుంది.

ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే ‘ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్’ ద్వారా నిరంతరాయంగా నిర్వహించనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల భాగస్వామ్యంతోనే ఈ ట్రస్ట్ పని చేయనుంది.

హెల్త్ కేర్ ట్రస్ట్ నిర్మాణం ఇలా..

ఈ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులను, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తారు. తద్వారా లబ్ధిదారుల సమస్యలను ఎప్పటికప్పుడు ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది.

ఈ ట్రస్ట్ కార్యకలాపాలను, పరిపాలనను పర్యవేక్షించడానికి ఒక సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ప్రభుత్వం నియమించనుంది. ఈ బోర్డు మెంబర్ల వివరాలతో కూడిన అధికారిక జీవోను, కమిటీని రేపే (సోమవారం) ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

నేటితో ముగియనున్న డేటా సేకరణ గడువు

ఈ సర్క్యులర్ ప్రకారం…. మే 31 (ఇవాళ) లోపు అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్ల అందరి డేటాను నిర్దేశిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఈ విధంగా సేకరించిన పూర్తి డేటాబేస్ ఆధారంగానే లబ్ధిదారులందరికీ అత్యాధునిక 'డిజిటల్ హెల్త్ కార్డులు' జారీ చేస్తారు. ఈ కార్డుల ద్వారా రాష్ట్రంలోని గుర్తింపు పొందిన అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా 'క్యాష్‌లెస్' అత్యుత్తమ చికిత్స సేవలు అందేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks