Telangana Indiramma Bima Scheme : రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. పేద కుటుంబాల్లో ఆకస్మికంగా సంభవించే విపత్తుల వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల భారీ జీవిత బీమా సదుపాయాన్ని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా కల్పించబోతుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ బీమా వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం…. తెలంగాణవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.15 కోట్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ నూతన పథకం ద్వారా గరిష్ట ఆర్థిక భద్రత చేకూరనుంది. కుటుంబంలో సంపాదించే ముఖ్య వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా, ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము అండగా నిలుస్తుంది.
- రూ.5 లక్షల ఉచిత బీమా : ఈ పథకంలో నమోదైన ఏ కుటుంబంలోనైనా దురదృష్టవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ప్రాణనష్టం సంభవిస్తే… ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం బీమా రూపంలో అందుతుంది.
- ప్రీమియం భారం లేదు : సాధారణంగా జీవిత బీమా పాలసీలకు ప్రతి ఏటా వేల రూపాయల్లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అయ్యే పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
- 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి : రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉండే పేద ప్రజల నుంచి పట్టణాల్లోని అణగారిన వర్గాల వరకు దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఒకేసారి ఈ స్కీమ్ వర్తింపజేసే అవకాశం ఉంది.
ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ, దరఖాస్తు విధానం క్లెయిమ్ చేసుకునే నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఈ స్కీమ్ పట్టాలెక్కనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ స్కీమ్ ను ప్రారంభించే అవకాశం ఉంది.
{{/usCountry}}ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ, దరఖాస్తు విధానం క్లెయిమ్ చేసుకునే నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఈ స్కీమ్ పట్టాలెక్కనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ స్కీమ్ ను ప్రారంభించే అవకాశం ఉంది.
{{/usCountry}}గ్రామ సభలు, ప్రజా పాలన కేంద్రాల ద్వారా పారదర్శకంగా అర్హులైన కుటుంబాల డేటాను సేకరించి, ఈ ఉచిత బీమా కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.