తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో నైపుణ్యంతో పాటు మంచి సంకల్పం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడుదారులకు పిలుపునిచ్చారు.

Published on: Apr 3, 2026, 14:52:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో తమతో భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.

అటెక్స్‌కాన్-2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
అటెక్స్‌కాన్-2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON2026) ను నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేశారు. ఈ సదస్సులో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి… మంత్రులతో కలిసి సందర్శించారు.

ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. “అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. శతాబ్దాలుగా క‌ళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్‌ రంగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాయి. నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్ నగరానికి వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలదు. టెక్స్‌టైల్స్ మా డీఎన్ఏలో ఉంది" అని గుర్తు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం - ముఖ్యమైన పాయింట్లు :

  • "వస్త్ర పరిశ్రమలో తెలంగాణ ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలున్నాయి. దేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాం. పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. టెక్స్ టైల్ తెలంగాణకు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. ప్రజల జీవనాధారం. ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వరకు అనేకం ఇక్కడున్నాయి.
  • తెలంగాణలో నైపుణ్యం ఉంది. మంచి సంకల్పం కూడా ఉంది. డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ వంటి అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. వరంగల్‌లో కాకతీయ ప్ర‌పంచ స్థాయి మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశాం. అందులో అనేక అప్పరెల్‌ పార్కులున్నాయి.
  • మా విజన్ తెలంగాణ రైజింగ్ - 2047. 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం.
  • వస్త్ర పరిశ్రమకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తుంది. ప్రపంచ పోటీకి అనుగుణంగా విధానాలు అనుసరిస్తున్నాం. అత్యుత్తమ మానవ వనరుల బలం ఉంది.
  • తెలంగాణ పత్తి పొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేం క‌లిసి ప‌ని చేస్తున్నాం. మీకు విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములం అవుతాం. అందరం కలిసి, ప్రపంచాన్ని మార్చగల పూర్తి టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం.
  • హైదరాబాద్ భారతదేశానికి కాకుండా, ప్రపంచానికి సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతోంది. ఇటీవల Netflix ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించాను. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరింది. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తాం.
  • పర్యావరణ పరిరక్షణ మాకు అత్యున్నత ప్రాధాన్యం. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తాం. యువతకు ముఖ్యంగా మహిళలకు శిక్షణనిస్తాం. సంప్రదాయ ఆలోచనలతో పాటు ఆధునిక పరికరాలతో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో ఉపయోగించగలం.
  • ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నది మా సంకల్పం. తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే కాదు. విజయవంతమైన భాగస్వాములం. అందరం కలిసి సరికొత్త భవిష్యత్తును నిర్మిద్దాం. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలి” అని పెట్టుబడుదారులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More