Telangana Free Sewing Machine Scheme : రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని భావిస్తోంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలు స్వయం ఉపాధి పొంది, తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడమే లక్ష్యంగా ‘ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బలహీన వర్గాల మహిళల ఉత్పాదకతను పెంచి, వారిని స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమైన వివరాలను వెల్లడించారు.
నియోజకవర్గానికి వెయ్యి మంది...
ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,000 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వీరికి 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను అందజేస్తారు. అంటే లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే అధునాతన కుట్టు యంత్రాలను సొంతం చేసుకోవచ్చు. టైలరింగ్‌ను కేవలం వృత్తిగా కాకుండా, ఒక వ్యాపార అవకాశంగా విస్తరించుకోవడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనుంది.
పథకం అమలు తీరుపై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమాయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు మరియు ఇతర ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు, వారిలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ, దరఖాస్తులు
ఈ పథకానికి సంబంధించి త్వరలోనే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరగనుంది. స్థానిక నియోజకవర్గాల వారీగా అర్హులైన బీసీ మహిళల వివరాలను సేకరించి, వారికి తగిన శిక్షణతో పాటు యంత్రాలను పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
{{/usCountry}}ఈ పథకానికి సంబంధించి త్వరలోనే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరగనుంది. స్థానిక నియోజకవర్గాల వారీగా అర్హులైన బీసీ మహిళల వివరాలను సేకరించి, వారికి తగిన శిక్షణతో పాటు యంత్రాలను పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుందని, తద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాన్ని ఈ పథకం ద్వారా పంపిస్తోంది.