...
...
Next Story

Telangana Drought Mandals : ఎల్‌నినో ఎఫెక్ట్‌ - కరువు ప్రాంతాలుగా 365 మండలాలు, తెలంగాణ సర్కార్ ప్రకటన

Telangana Drought Mandals 2026 : ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరవు మండలాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 365 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్లు వెల్లడించింది.

Published on: Oct 28, 2026, 05:12:32 IST
Advertisement

Telangana Drought Mandals 2026 : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కరవు మండలాలపై ప్రకటన  (ప్రతీకాత్మక చిత్రం)
కరవు మండలాలపై ప్రకటన (ప్రతీకాత్మక చిత్రం)

మొత్తం 365 మండలాల్లో కరవు తీవ్రతను రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఇందులో 111 మండలాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉండటంతో వాటిని 'తీవ్ర కరువు' ప్రాంతాలుగానూ, మరో 254 మండలాలను 'మధ్యస్థ కరువు' ప్రాంతాలుగానూ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ గురువారం రాత్రి ఉత్తర్వులు (GO) జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచి తదుపరి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది.

సహాయక చర్యలు….

కరవు తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయిలో బాధితులకు తక్షణమే ఊరట కలిగించేలా చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) విధానం ద్వారా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించడం, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నీటి సరఫరాను విస్తరించడం, పశుగ్రాసం కొరత లేకుండా చూడటం, అవసరమైన చోట పశువుల క్యాంపులు ఏర్పాటు చేయడం వంటి చర్యలను వెంటనే ప్రారంభించాలని సీఎస్ ఆదేశించారు. అలాగే వీబీ-జీ రామ్ జీ (VB-G RAM G) పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

రైతులకు రుణ ఉపశమనం…..

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో వాతావరణ పరిణామం తీవ్ర ప్రభావం చూపింది. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థలు బలహీనపడటం, సుదీర్ఘ కాలం పొడి వాతావరణం నెలకొనడమే ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణమని ప్రభుత్వం పేర్కొంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తెలంగాణ వ్యాప్తంగా సాధారణంగా 740.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి కేవలం 615.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతంలో 17 శాతం లోటు ఏర్పడింది. మొత్తం 33 జిల్లాల్లో 18 జిల్లాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వరి సాగుకు విఘాతం.. ప్రాజెక్టుల్లో పడిపోయిన నీటి మట్టాలు

వర్షాభావం కారణంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయింది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం ఏకంగా 18 శాతం తగ్గింది. గతంలో 69.19 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ ఏడాది అది 57.00 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన, మధ్యతరహా జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ప్రాజెక్టుల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 585 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 179.63 టీఎంసీల మేర మాత్రమే నీరు లభ్యతలో ఉంది. దీంతో రాష్ట్రంలో తాగునీరు, వ్యవసాయం, పశుసంపద కాపాడుకోవడం సహా విద్యుత్ ఉత్పత్తి రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఏర్పడిందని ప్రభుత్వం హెచ్చరించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks