నైరుతి రుతుపవనాల నిష్క్రమణ... తెలంగాణలో మండుతున్న ఎండలు, పెరిగిన ఉక్కపోత!

తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో పొడి వాతావరణం నెలకొననుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.

Published on: Oct 8, 2026, 17:33:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. భానుడి ప్రతాపానికి తోడు… హీట్ వల్ల తీవ్రమైన ఉక్కపోత ఏర్పడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

తెలంగాణలో మండుతున్న ఎండలు, పెరిగిన ఉక్కపోత! (image source pixel)
తెలంగాణలో మండుతున్న ఎండలు, పెరిగిన ఉక్కపోత! (image source pixel)

రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో గురువారం నాటికి పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటేశాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే…. ఆదిలాబాద్‌లో గరిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 36.2 డిగ్రీలుగా నమోదైంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని చాలా ఏరియాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది.

రుతుపవనాల నిష్క్రమణ…!

రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ వేగవంతమైంది. గురువారం నాటికి ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు 50 శాతం మేర రుతుపవనాలు వెనక్కి మళ్లాయి. మిగిలిన ప్రాంతాల నుంచి కూడా రేపటికల్లా (శుక్రవారానికి) రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. మొత్తంగా రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణ అంతటా రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక రాష్ట్రానికి ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 15 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.

వాతావరణ నిపుణుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 25వ తేదీ నాటికే తెలంగాణలో వర్షాకాలం ప్రభావం దాదాపు ముగిసింది. ఇకపై రాష్ట్రంలో వర్ష సూచన ఏమాత్రం లేదని…. ఆకాశం పొడిగా ఉండనుంది. వర్షాలు తగ్గుముఖం పట్టి, పొడి గాలులు వీయడంతో రాబోయే రోజుల్లో మధ్యాహ్నం వేళ ఎండ దెబ్బ ఎక్కువగా ఉండే సూచనలున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More