రాయలసీమలో భానుడి భగభగలు.. మంత్రాలయంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

AP Weather : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం రోజున రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Published on: Oct 4, 2026, 14:49:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఎల్‌నినో ప్రతికూల ప్రభావం కారణంగా రాయలసీమ ప్రాంతంలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. వర్షాలు లేక ఎండల తీవ్రత రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతోంది. రాయలసీమలోని పలు జిల్లాల్లో అప్పుడే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో శనివారం అత్యధికంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతంలో ఎండల ధాటికి భక్తులు, స్థానికులు తీవ్ర తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దాదాపు 36 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాలు లేక వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

మంత్రాలయం-38.4 డిగ్రీలు(రాయలసీమలోనే అత్యధికం), పాన్యం (నంద్యాల జిల్లా) 38.3 డిగ్రీలు, పగిడ్యాల 38.2 డిగ్రీలు, ఉయ్యాలవాడ 38.0 డిగ్రీలు, కొత్తపల్లె, దోర్నిపాడు 37.9, కర్నూలు రూరల్ 37.7 డిగ్రీలు, కోడుమూరు 37.4 డిగ్రీలు, కల్లూరు 37.1 డిగ్రీలు, కర్నూలు అర్బన్ 36.8 డిగ్రీలు, వెల్దుర్తి 36.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ భానుడి ఉగ్రరూపం స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్లనూరు తాడిపత్రి 37.2 డిగ్రీలు, అనంతపురం అర్బన్: 37.0 డిగ్రీలు, తలుపుల (శ్రీ సత్యసాయి జిల్లా) 37.0 డిగ్రీలు, పుట్లూరు, కళ్యాణదుర్గం 36.8 డిగ్రీలు, కదిరి 36.8 డిగ్రీలు, విడపనకల్లు, తనకల్లు, నంబూలపూలకుంట 36.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వర్షాభావం వల్ల గాలిలో తేమ శాతం తగ్గి, భూతాపం విపరీతంగా పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమలో విస్తారంగా సాగయ్యే ఉద్యానవన పంటలపై ఈ వేడిగాలులు, తీవ్ర ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రాయలసీమకు పేరుగాంచిన బత్తాయి తోటలు నీటి కొరత, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. పూత, పిందె దశలోనే రాలిపోయే ప్రమాదం ఏర్పడింది.

అధిక వేడి వల్ల పిందెలు నిలవక దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటిమట్టం పడిపోయి, ఉన్న తోటలను కాపాడుకోవడం రైతులకు సవాలుగా మారింది. వాతావరణ మార్పుల దృష్ట్యా ఉద్యానవన శాఖ అధికారులు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు, బిందు సేద్యం పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More