IMD October Weather : ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ నెల వర్షపాతం తక్కువ.. అధిక ఉష్ణోగ్రతలు
IMD October Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ నెల వర్షపాతం తక్కువగా నమోదు కానుంది. అదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన నెలవారీ అంచనాల ప్రకారం.. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అక్టోబర్ నెలలో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ అంచనాల ప్రకారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీని ప్రాబబిలిటీ 33.5 శాతం నుండి 55 శాతం మధ్య ఉండవచ్చు.

అదే సమయంలో ఈ ఏడాది అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్ నినో పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తూర్పు-మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతాలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.
మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్(MMCFS), ఇతర ప్రధాన వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం, ఈ ఏడాది చివరి వరకు ఎల్ నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 15 నాటికి దేశం నుండి పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అమరావతిలోని ఐఎండీ కేంద్రం అక్టోబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎటువంటి వర్షపాత సూచనలను జారీ చేయలేదు. అయితే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ ప్రకారం.. 2026లో భారతదేశ నైరుతి రుతుపవనాల సీజన్ లోటు వర్షపాతంతో ముగిసింది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య దేశంలో 759.4 మి.మీ వర్షపాతం నమోదైంది, ఇది 868.6 మి.మీగా ఉన్న దీర్ఘకాలిక సగటులో 87 శాతం మాత్రమే. 2001 తర్వాత నమోదైన అత్యల్ప వర్షపాతంలో ఇది నాలుగవది, 1901 తర్వాత 13వ అత్యల్ప స్థాయి.
ఈ సీజన్‌లో కేరళలో రుతుపవనాల రాక ఆలస్యం కావడం, జూన్‌లో తీవ్ర వర్షపాత లోటు, జూలైలో పుంజుకోవడం, ఆగస్టులో మళ్లీ తగ్గడం, సెప్టెంబర్ చివరిలో భారీ వర్షాలు కురవడం వంటి అంశాలు కనిపించాయి. రుతుపవనాలు సాధారణ తేదీ కంటే ఆరు రోజుల ముందుగానే.. అంటే మే 16న అండమాన్ సముద్రాన్ని తాకాయి. కానీ ఆ తర్వాత ముందుకు కదలడంలో స్తంభించిపోయాయి. సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే మూడు రోజుల ఆలస్యంగా, జూన్ 4న ఇవి కేరళను తాకాయి. ఇక సెప్టెంబర్ కొంత ఉపశమనాన్ని అందించింది. ఈ నెలలో తీవ్ర వాయుగుండం కారణంగా వానలు పడ్డాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


