Telangana Govt : రేపు బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ
బీసీ మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించే పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.

రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేయడం ఈ పథకం ప్రత్యేకత.
ఆగస్టు 13, 2026 గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని జీ-29లో ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించడంతో పాటు, వారి ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పథకం విధి విధానాలు, కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగస్టు 13న నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించనున్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు.బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తూ, మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేసే దిశగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కీలక ముందడుగుగా నిలవనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


