తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు.. ఇలా అప్లై చేయాలి?
తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ డిసెంబర్ 20 నుండి జనవరి 19 వరకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాలలోని విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్/పీహెచ్‌డీ కోర్సులలో ఉన్నత విద్య కోసం మైనారిటీ వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 20 నుండి జనవరి 19 వరకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద దరఖాస్తులు చేసుకోవాలి.

ఎంపికైన అభ్యర్థులకు రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్ మొత్తంతో పాటు వన్-వే టికెట్ ఛార్జీ అందిస్తారు. జూలై 1 నుంచి డిసెంబర్ 31, 2025 మధ్య అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని గుర్తుంచుకోవాలి. Telangana ePASS వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సకాలంలో చేస్తారు. ఏదైనా తప్పుడు సర్టిఫికెట్లు దొరికితే సంబంధిత అభ్యర్థిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం: ఇంజనీరింగ్ / మేనేజ్‌మెంట్ / ప్యూర్ సైన్సెస్ / అగ్రికల్చర్ సైన్సెస్ / మెడిసిన్, నర్సింగ్ / సోషల్ సైన్సెస్ / హ్యుమానిటీస్‌లో ఫౌండేషన్ డిగ్రీలో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ ఉండాలి.
పీహెచ్‌డీ కోర్సులకు: ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్/ప్యూర్ సైన్సెస్/అగ్రికల్చర్ సైన్సెస్/మెడిసిన్/సోషల్ సైన్సెస్/హ్యుమానిటీస్‌లో పీజీ కోర్సులో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ ఉండాలి.
అర్హతలు
దరఖాస్తుదారు తెలంగాణ నివాసి అయి ఉండాలి. మైనారిటీ వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తుదారులకు అర్హత గల గరిష్ట వయోపరిమితి సంవత్సరం జూలై 1 నాటికి 35 సంవత్సరాలు మించరాదు. ఒక కుటుంబం నుండి ఒకకిరి మాత్రమే అవకాశం. దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే TOEFL/IELTS & GRE/GMAT కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది ఉండాలి. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. కుటుంబ ఆదాయం అన్ని వనరుల నుండి సంవత్సరానికి రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: telanganaepass.cgg.gov.in/OverseasLinks.do
రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి
దరఖాస్తు వివరాలను సమర్పించండి
వీసా వివరాలు, ప్రవేశం పొందిన విదేశీ సంస్థ వివరాలను ఇవ్వాలి.
దరఖాస్తు ఫారమ్ నింపిన తర్వాత అభ్యర్థులు వెబ్‌సైట్‌లో జాబితా చేసిన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.
అన్ని ఫైళ్ళను ఒరిజినల్ డాక్యుమెంట్ల నుండి స్కాన్ చేయాలి. జిరాక్స్ డాక్యుమెంట్ల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయడం వలన దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఫైళ్ళు 50కేబీ, 150కేబీ మధ్య పరిమాణంలో jpg/jpeg ఫార్మాట్‌లో ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు సమర్పించిన తర్వాత భవిష్యత్తు కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్‌ను కూడా తీసుకోవాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












