గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు వేగవంతమవుతోంది. ఈనెలఖారులోపే షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా తేదీలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3 వారంలోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండగా… ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించే యోచనలో ఉంది.
3 దశల్లో ఎన్నికలు…!

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇవాళ పూర్తిస్థాయిలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ సూచనల మేరకు ఈసీ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. డిసెంబర్ 2 వారంలోని కొన్ని తేదీల్లో పోలింగ్ జరిపేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఈసీ అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఏది ఏమైనా డిసెంబర్ 3 వారం కంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు ఈనెల 24వ తేదీన హైకోర్టులో స్థానిక ఎన్నికలపై విచారణ జరగనుంది. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతినిస్తే… పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు లైన్ క్లియర్ అయిపోతుంది. ఇక ఈసీ ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ఇవాళ ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియ షురూ అయింది. ఈనెల 23 వరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఇవాళ ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుంది. ఇక ఈనెల 23వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుంది.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ…. ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికల నిర్వహించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉంది. అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కోర్టు నుంచి బ్రేక్ పడగా…. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కూడా ప్రకటించింది.
{{/usCountry}}ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ…. ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికల నిర్వహించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉంది. అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కోర్టు నుంచి బ్రేక్ పడగా…. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కూడా ప్రకటించింది.
{{/usCountry}}ఇక రాష్ట్రంలో ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించి… ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే కసరత్తు చేస్తోంది.