తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యూనిఫాం సర్వీసెస్(పోలీస్) ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో 2 ఏళ్ల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నూతన మినహాయింపు పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఎక్సైజ్, రవాణా (ట్రాన్స్‌పోర్ట్), అటవీ (ఫారెస్ట్) శాఖలలో జరిగే ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న 5 ఏళ్లు.. ఇప్పుడు ఇచ్చిన 2 ఏళ్లతో మెుత్తం సడలింపు 7 ఏళ్లకు చేరింది. ఇటీవల అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది మే 18న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే సాధారణ నియామక నిబంధనల ప్రకారం ఇచ్చే వయోపరిమితిపై 5 ఏళ్ల సడలింపును అమలు చేస్తున్నారు. ఆ 5 ఏళ్లకు అదనంగా ఇప్పుడు మరో 2 ఏళ్లు వయోపరిమితిని పెంచారు. దీనివల్ల వేలాది మంది యువతకు యూనిఫాం సర్వీసుల్లో ఉద్యోగం సాధించేందుకు అదనపు అవకాశం లభించనుంది. వయస్సు ముగిసిపోతోందన్న ఆందోళనలో ఉన్న పోటీ పరీక్షల అభ్యర్థులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది.
ఆగస్టు 19 నుంచి దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ , ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7437 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను వెల్లడించింది. జులై 29న ఈ ఖాళీల భర్తీకి సంబంధించి రిక్రూట్‌మెంట్ బోర్డు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అభ్యర్థులు కేవలం టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇతర ఏ మార్గాల్లో పంపిన దరఖాస్తులైనా తిరస్కరిస్తారు. దరఖాస్తుల ప్రారంభ తేదీ ఆగస్టు 19 (ఉదయం 8.00 గంటల నుండి), చివరి తేదీ సెప్టెంబర్ 9 (సాయంత్రం 5.00 గంటల వరకు) దాకా అప్లై చేసుకోవచ్చు.
{{/usCountry}}అభ్యర్థులు కేవలం టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇతర ఏ మార్గాల్లో పంపిన దరఖాస్తులైనా తిరస్కరిస్తారు. దరఖాస్తుల ప్రారంభ తేదీ ఆగస్టు 19 (ఉదయం 8.00 గంటల నుండి), చివరి తేదీ సెప్టెంబర్ 9 (సాయంత్రం 5.00 గంటల వరకు) దాకా అప్లై చేసుకోవచ్చు.
{{/usCountry}}ఈ నియామక ప్రక్రియలో నిర్దేశించిన వన్-టైమ్ ఫీజు అభ్యర్థన ప్రాసెసింగ్, ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఫలితాల ప్రాసెసింగ్ వంటి మొత్తం ప్రక్రియకు వర్తిస్తుంది.
సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750, ఇతర అభ్యర్థులందరికీ (ఓసీ/బీసీ) రూ.1,500గా ఫీజు ఉంది. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్టులు అప్లై చేసే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతర అభ్యర్థులందరికీ రూ.1,200గా ఫీజు నిర్ణయించారు.
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫింగర్‌ప్రింట్ బ్యూరో), పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్), పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) వంటి సాంకేతిక పోస్టులకు కూడా ఇదే విధమైన రుసుములు వర్తిస్తాయి. అర్హత కలిగిన పోస్టులకు ప్రాక్టికల్, ట్రేడ్, డ్రైవింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.