TG Road Safety Cess : కొత్తగా వాహనాలు కొనాలనుకుంటున్నారా…? మార్చి 1 నుంచి కొత్త రూల్, ఈ ట్యాక్స్ కట్టాల్సిందే...!
Telangana Govt Road Safety Tax : కొత్త వాహనాల కొనుగోలుపై మరో ట్యాక్స్ పడనుంది. రహదారి భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) చెల్లించాలనే నిబంధన మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా వాహనం కొనాలనుకుంటున్నారా..? అయితే అదనంగా మీ వద్ద డబ్బులు ఉండాల్సిందే…! ఎందుకంటే ఈ మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ సెస్ (రోడ్డు భద్రత పన్ను) వసూలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మోటర్ వెహికల్ యాక్ట్ చట్టంలో పన్నుల విధింపుపై రాష్ట్రానికి ఉన్న అధికారాల్ని వినియోగిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని వివరాల ప్రకారం….. నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనంగా రోడ్డు భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణలో రోడ్డు సెఫ్టీ సెస్ - ముఖ్యమైన వివరాలు:
- ఈ మార్చి 1వ తేదీ నుంచి తెలంగాణలో రోడ్డు సెఫ్టీ సెస్ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
- కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుంచి రూ.10,000 వరకు రోడ్డు భద్రత పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- ద్విచక్ర వాహనాలు, కార్లతోపాటు ఇతర వ్యక్తిగత వాహనాలు, ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఆటోలు ఈ పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తాయి.
- ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా సుమారు రూ.270 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
- వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
- తేలికపాటి వాహనలైన ద్విచక్రవాహనాల కొనుగోలు చేసే సమయంలో ఈ పన్ను కింద రూ. 2 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
- కార్ల వంటి వాటికి రూ.5 వేలు వసూలు చేస్తారు. గూడ్స్ వెహికల్స్, ఆటోలకు రూ.10 వేల వరకు పన్ను పడొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

