Hyderabad : మొబైల్ అంగన్ వాడీలు వచ్చేస్తున్నాయ్...! ఇక మీ ఇంటి దగ్గరికే సరుకులు
మొబైల్ అంగన్వాడీలను ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే మొబైల్ అంగన్‌వాడీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసించే ప్రాంతాలు, బస్తీలు, స్లమ్ ప్రాంతాల్లో అంగన్‌వాడీ సేవలను సరికొత్తగా అందించే దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. భవనాల కొరత, సాంకేతిక సమస్యలు, అలాగే కొత్త అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో… మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఇంటి వద్దకే సరుకులు…
టేక్ హోం రేషన్ విధానంలో అర్హుల నివాసాలకే సరుకులు అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇందులో బాలమృతం, పాలు, స్నాక్స్, కోడి గుడ్లు, బియ్యం తదితర పోషకాహార పదార్థాలను పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమం అమలుకు సంవత్సరానికి సుమారు రూ. 4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే మొబైల్ అంగన్‌వాడీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
37 వాహనాలను సిద్ధం చేసి… వాటి ద్వారా 274 స్లమ్ ఏరియాలను కవర్ చేస్తూ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా శిశు సంక్షేమశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. జిల్లా వారీగా హైదరాబాద్ లో 7, మేడ్చెల్-మల్కాజిగిరిలో 15, సంగారెడ్డిలో 1, రంగారెడ్డిలో 14 వాహనాలను వినియోగించనున్నారు. ఈ మొబైల్ కేంద్రాలను సమీప అంగన్వాడీ కేంద్రాలకు అనుబంధంగా నిర్వహిస్తారు. ఫలితంగా అర్హులు ఎక్కడ ఉంటారో వాళ్లు ఉండే చోటనే సరుకులను అందిస్తారు.
అర్హులు నష్టపోవద్దు - మంత్రి సీతక్క
ఈ సందర్బంగా పోషకాహార సేవలు అర్హులందరికీ అందాలని… సాంకేతిక సమస్యలతో ఎవరూ నష్టపోకూడదన్న లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. పోషకాహారానికి ఆటంకం కలగకూడదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రైజింగ్– 2047 లక్ష్యాలలో భాగంగా పోషకలోప రహిత తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

