తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మెుదలైంది. మూడు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఆయా రోజుల్లోనే ఫలితాలను కూడా ప్రకటిస్తారు.

ఎన్నికల సంఘం ప్రకారం రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు. పలు కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికలను జరగడం లేదు.
మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లు. సర్పంచ్, వార్డు సభ్యులు వారి నామినేషన్లను సమర్పించవచ్చు. నవంబర్ 29వ తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచి ఎన్నికను సైతం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు తుది ఫలితాలను ప్రకటిస్తారు. మెుదటి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు ఉంటాయి.
ఏమేం కావాలి?
గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి తప్పనిసరిగా గ్రామ పంచాయతీ స్థానికుడై ఉండాలి. ఇందుకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం. పోటీ చేయాలనుకునే అభ్యర్థి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. నామినేషన్ దాఖలు చేసే సమయానికి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. రిజర్వ్ చేసిన స్థానాల్లో సంబంధిత రిజర్వ్‌డ్ అభ్యర్థులకే అవకాశం ఉంది. ఇందుకోసం క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయవచ్చు. మహిళలు వారికి రిజర్వ్ చేసిన స్థానాలతోపాటుగా జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయవచ్చు. ఇద్దరు పిల్లలు నిబంధన కూడా ఎత్తివేశారు.
నేర చరిత్ర, చర, స్తిర ఆస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిట్‌పై ఇద్దరు సాక్షులతో సంతకం చేయించాలి. ఎలక్షన్ ఖర్చు వివరాలకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి. నామినేషన్ పత్రంలో సంతకాల విషయంలో కూడా ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. హౌస్ టాక్స్ కట్టి ఉండాలి.
{{/usCountry}}నేర చరిత్ర, చర, స్తిర ఆస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిట్‌పై ఇద్దరు సాక్షులతో సంతకం చేయించాలి. ఎలక్షన్ ఖర్చు వివరాలకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి. నామినేషన్ పత్రంలో సంతకాల విషయంలో కూడా ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. హౌస్ టాక్స్ కట్టి ఉండాలి.
{{/usCountry}}