తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం ఏర్పాట్లు మెుదలుపెట్టాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమదిని తాజాగా వివరాలను వెల్లడించారు.

డిసెంబర్ 11న తొలి విడత ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉండనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది. ఒక దశకు మరో దశకు మధ్య రెండు రోజుల తేడా ఉంటుంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
ఈ నెల 27వ తేదీ నుంచి మెుదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. అలాగే 30వ తేదీన రెండో దశ, డిసెంబర్ 3న మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. మూడు విడుతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఫేజ్‌ల వారీగా పోలిగ్ రోజే ఉంటుందన్నారు.
రాష్ట్రంలో కోటీ 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమదిని చెప్పారు. గతంలో కొన్ని కారణాలతో ఎన్నికల వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. ఇప్పుడు సర్పంచ్, వార్డు మెంబర్స్ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
'మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయతీలు, లక్షా 13,534 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు ఉంటాయి. రెండో విడతలో భాగంగా 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తాం. ఎలక్షన్ అబ్జార్వర్లను ఇప్పటికే నియమించాం. ఓటర్ల జాబితాతోపాటుగా అన్ని వివరాలు మా వెబ్సైట్లో ఉంటాయి. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి.' అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.
{{/usCountry}}'మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయతీలు, లక్షా 13,534 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు ఉంటాయి. రెండో విడతలో భాగంగా 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తాం. ఎలక్షన్ అబ్జార్వర్లను ఇప్పటికే నియమించాం. ఓటర్ల జాబితాతోపాటుగా అన్ని వివరాలు మా వెబ్సైట్లో ఉంటాయి. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి.' అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.
{{/usCountry}}