తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడతలో 395 గ్రామాలు ఏకగ్రీవం - అత్యధికంగా ఎక్కడంటే..?
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే మొదటి విడత కింద బరిలో నిలిచిన అభ్యర్థులను వివరాలను ఈసీ తాజాగా ప్రకటించింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 395 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 39 స్థానాలతో వికారాబాద్ జిల్లా ముందు వరుసలో నిలిచింది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా.. ప్రస్తుతం మూడో విడత నామినేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే తాజాగా మొదటి విడత కింద బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో తేదీ నామినేషన్ల విత్ డ్రా పూర్తైంది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 4,236 గ్రామాలకు మొదటి విడతలో నోటిఫికేషన్ ఇవ్వగా 22, 330 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీటిలో 395 గ్రామాల్లోని సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
అత్యధికంగా ఎక్కడంటే…?
వికారాబాద్ జిల్లాలోని 39 గ్రామాల్లో అత్యధికంగా ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత 33 గ్రామాల్లో ఏకగ్రీవమైన ఆదిలాబాద్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో 3 గ్రామాలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో 4 గ్రామాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
- మొదటి విడత కింద 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వార్డులతో కలిపి 81,020 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు
- 3,836 గ్రామ పంచాయతీ ల సర్పంచ్ పదవికోసం 13,127 మంది అభ్యర్థులు ఎన్నికకు బరిలో నిలిచారు.
- దాదాపు 22,000 మంది సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేయగా 8,095 మంది అభ్యర్థులు తమ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.
- మొదటి విడత కింద వార్డులకు సభ్యులుగా పోటీ చేసేందుకు 67,893 మంది ఫైనల్ గా బరిలో నిలిచారు.
- నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు 5 ఉన్నాయి. వీటిపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.
- మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన జరగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ఉంటుంది. ఇక అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు.
- ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచి ఎన్నికను సైతం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు తుది ఫలితాలను ప్రకటిస్తారు.
మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. 6వ తేదీన నామినేషన్ల పరిశీలన, 7, 8 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ.. 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తారు. మూడో దశకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

