...
...
Next Story

గ్రూప్-1పై తీర్పు ఇంకా రెడీ కాలేదన్న హైకోర్టు.. వచ్చేనెల 5కు వాయిదా

గ్రూప్-1పై హైకోర్టు ఇవ్వాల్సిన తీర్పు వాయిదా పడింది. తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు వెల్లడించింది. దీంతో ఉత్కంఠ మరికొన్ని రోజులు కొనసాగనుంది.

Published on: Jan 22, 2026, 11:31:17 IST
Advertisement

గ్రూప్-1పై తీర్పు వచ్చేనెల 5కు వాయిదా వేసింది హైకోర్టు. తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. గ్రూప్-1 పై ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుతో 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనుంది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

కిందటి నెలలో సంబంధిత పిటిషన్లపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈరోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తీర్పు ఇంకా రెడీ కాలేదని.. ఫిబ్రవరి 5వ తేదీ వాయిదా వేసింది హైకోర్టు. 2024 అక్టోబర్‌లో నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10వ తేదీన వెల్లడించిన తుది మార్కుల జాబితా, మార్చి 30వ తేదీన ప్రకటించన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు.

అంతేకాదు గ్రూప్ 1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత ఫలితాలను ప్రకటించాలని కమిషన్‌ను ఆదేశించింది కోర్టు. ఒకవేళ ఇది సాధ్యంకాకపోతే.. మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేసింది. పలువురు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సీజే ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది.

ఈ గ్రూప్ 1పై ఈరోజు తీర్పు వెలువడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 5వ తేదీకి తీర్పు వాయిదా పడింది. ఇప్పటికే 563 మంది అభ్యర్థుల అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందుకున్నారు. కోర్టు తీర్పు ఏం ఇస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks