రాహుల్ సిప్లిగంజ్ 'కల్ట్' వెబ్‌సిరీస్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నటించిన కల్ట్ వెబ్‌సిరీస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఓటీటీలో విడుదల కావడంపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాబోయే వెబ్ సిరీస్ 'కల్ట్'ను జనవరి 17 నుండి ఓటీటీలో విడుదల కానుంది. అయితే ఈ వెబ్‌సిరీస్ విడుదల చేయడాన్ని నిలిపివేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ వెబ్‌సిరీస్ అడ్డుకోవాలని కోరుతూ.. ఉత్తమ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రాథమిక వాదనలు విన్న తర్వాత సిప్లిగంజ్, నిర్మాతలు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. అయితే ఈ దశలో విడుదలను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. నిర్మాణ సంస్థ, ఇతర ప్రతివాదుల వాదనలు వినకుండా ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వడం కుదరదని తెలిపింది.
వెబ్ సిరీస్ నిర్మాత, దర్శకుడు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు ఉత్తమ్ వల్లూరి అనే వ్యక్తి. ఈ వెబ్‌సిరీస్‌లో మదనపల్లి హత్యలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించిన అభ్యంతరకరమైన కంటెంట్ ప్రచారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు విచారణలో ఉన్న కేసుకు డ్రామా జోడించి.. చిత్రీకరణ చేయడం చట్టవిరుద్ధమని, విచారణలో ఉన్న అంశాన్ని తప్పుదోవ పట్టించడం కిందకే వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు.
పిటిషనర్ ప్రకారం.. గతంలో మదనపల్లి మర్డర్స్ అని పేరు పెట్టిన ఈ సిరీస్ తరువాత కల్ట్ అని పేరు మార్చారు. ఇది సబ్ జ్యుడీస్ ప్రొసీడింగ్స్‌ను వక్రీకరించి డ్రామా జోడించడమే. ఇది డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ సెక్షన్ 69A,టెక్నాలజీ యాక్ట్‌ను ఉల్లంఘించినట్టు అని, కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి వెబ్‌సిరీస్ తీయడం సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో 2021లో జరిగిన హత్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. విశ్వాసాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి. ఇద్దరు అక్కాచెల్లెల్లు ఈ ఘటనలో మృతి చెందారు. మానసికంగా ఆ కుటుంబం సరిగా లేక ఈ దారుణం జరిగింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


