గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన హైకోర్టు
గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట దక్కింది. మెయిన్స్ పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన నిర్ణయాన్ని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఉపశమనం కలుగుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించింది. అయితే సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె. పరుశరాములు, ఇతరులతో కలిసి మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, న్యాయ విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.

పిటిషన్లను విచారించిన తర్వాత సింగిల్ జడ్జి బెంచ్ మార్చి 10న జారీ చేసిన తుది మార్కుల జాబితాను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేసింది. అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి కొత్త ఫలితాలను ప్రకటించాలని కూడా టీజీపీఎస్సీని ఆదేశించింది. తిరిగి మూల్యాంకనం సాధ్యం కాకపోతే.. పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని ఆదేశించింది.
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టీజీపీఎస్సీ, అనేక మంది గ్రూప్-1 అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసుకున్నారు. ఇప్పుడు తుది తీర్పును వెలువడింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది హైకోర్టు.
నిజానికి జనవరిలోనే తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ తీర్పు రెడీ కాలేదని హైకోర్టు చెప్పింది. ఫిబ్రవరి 5వ తేదీ వాయిదా వేసింది హైకోర్టు. దానిప్రకారం తాజాగా తీర్పు వెల్లడించింది. 2024 అక్టోబర్‌లో నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10వ తేదీన వెల్లడించిన తుది మార్కుల జాబితా, మార్చి 30వ తేదీన ప్రకటించన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు.
అంతేకాదు గ్రూప్ 1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత ఫలితాలను ప్రకటించాలని కమిషన్‌ను ఆదేశించింది కోర్టు. ఒకవేళ ఇది సాధ్యంకాకపోతే.. మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేసింది. పలువురు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సీజే ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది.
గతంలో టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది సుదర్శన్‌రెడ్డి వాదనలు సందర్భంగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయని కోర్టుకు తెలిపారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకుండా చూశారన్నారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం హాల్‌టికెట్లను వేర్వేరుగా జారీ చేసినట్టుగా వెల్లడించారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


