టీజీపీఎస్సీ ఓటీఆర్‌పై కీలక వార్త.. ఈ తేదీలోపు డేటా కచ్చితంగా అప్డేట్ చేయాల్సిందే

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) అభ్యర్థులకు కీలక అప్డేడ్ ఇచ్చింది. వన్-టైమ్ రిజిస్ట్రేషన్(OTR) నమోదు చేసుకున్న అభ్యర్థులందరూ తమ డేటాను తప్పనిసరిగా అప్డేట్ చేసి ధృవీకరించాలని ఆదేశించింది.

Published on: Feb 3, 2026, 09:21:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీజీపీఎస్సీలో ఉద్యోగాల కోసం చూసే అభ్యర్థులకు కమిషన్ కీలక విషయం తెలిపింది. నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓటీఆర్‌కు సంబంధించి కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తులో కీలకమైన ఓటీఆర్ చేసుకున్న 31.56 లక్షల మంది తమ ఐడీ సాయంతో తాజా వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

టీజీపీఎస్సీఓటీఆర్ అప్డేట్
టీజీపీఎస్సీఓటీఆర్ అప్డేట్

భవిష్యత్ నోటిఫికేషన్లకు ఇదే

భవిష్యత్తులో వచ్చే అన్ని నోటిఫికేషన్లు, దరఖాస్తులు, ఫలితాలు, తుది ఎంపికలు అభ్యర్థుల ఇప్పుడు అప్డేట్ చేసే OTR డేటా ఆధారంగా ఉంటాయని కమిషన్ స్పష్టం చేసింది. దాని ప్రకారం డేటా వ్యవస్థలో దాదాపు 31.65 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారంతా.. ఇప్పుడు అప్డేట్ చేయాలి.

ఈ కారణాలతో అప్డేట్

షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ, అభ్యర్థుల విద్యా అర్హతలలో మార్పుల కారణంగా ఇప్పుడు ఓటీఆర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. తాజా వివరాల తప్పనిసరిగా నమోదు చేయాలని కమిషన్ పేర్కొంది. 'నియామక ప్రక్రియలను వేగంగా పూర్తి చేయడం, ఫలితాల ముందస్తు ప్రకటన, నియామక ఉత్తర్వులను సకాలంలో జారీ చేయడం, డేటా వ్యత్యాసాలు, అసంపూర్ణ డాక్యుమెంటేషన్ కారణంగా కలిగే జాప్యాలను నివారించడానికి కమిషన్ ప్రయత్నాలలో ఇది భాగం.' అని టీజీపీఎస్సీ పేర్కొంది.

ఇవి అప్డేట్ చేయాలి

ఓటీఆర్‌ని అప్డేట్ చేసే ప్రక్రియలో అభ్యర్థి వ్యక్తిగత, విద్యా, కేటగిరీ వివరాల ధృవీకరణ, కచ్చితత్వం, అన్ని అర్హతలు, అదనపు అర్హతలు, తాజా కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌తో సహా అన్ని సంబంధిత సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయడం వంటివి చేయాలి. ఓటీఆర్‌లో అదనపు అర్హతలు, చిరునామా, ఈడబ్ల్యూఎస్, నాన్‌క్రీమీలేయర్ కేటగిరీలు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ మినహా ఇతర వివరాలను అప్డేట్ చేసేందుకు వీల్లేదు. ఈ తప్పనిసరి అప్డేట్‌ను పూర్తి చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2గా ఉండేది. అయితే ఇప్పుడు దానిని ఫిబ్రవరి 25 వరకు పొడిగించారు.

సరైన వివరాలు ఇవ్వాలి

రూల్ ప్రకారం.. ప్రతి అభ్యర్థికి ఒకే ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. ఇది ఏ కారణం చేతనైనా అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుతుంది. అభ్యర్థి అదనపు అర్హతలు, కరస్పాండెన్స్ చిరునామా, కమ్యూనికేషన్‌లో మార్పులు, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, కేటగిరీకి సంబంధించిన వివరాలను అప్‌లోడ్ చేయడం ద్వారా అతని/ఆమె డేటాను యాడ్ చేయవచ్చు, మెరుగుపరచవచ్చు అని కూడా కమిషన్ తెలిపింది. గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్నా.. ఆధారాలు సమర్పించలేదు. ఇప్పుడు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఇదే ఫైనల్

అభ్యర్థులు డేటాను అప్‌లోడ్ చేసేటప్పుడు, సవరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓటీఆర్ పోర్టల్‌లో అప్డేట్ చేసిన సమాచారమే తుది డేటాగా పరిగణిస్తారు. భవిష్యత్ నోటిఫికేషన్‌ల కోసం పరిశీలిస్తారు. దీనిద్వారానే భవిష్యత్తులో ఏదైనా నియామక ప్రకటనకు అర్హులు అవుతారా లేదా అనేది నిర్ణయిస్తారు.

ఫిబ్రవరి 25లోపు అప్డేచ్ చేయాలి. మరిన్ని వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో (https://www.tgpsc.gov.in/) అందుబాటులో ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More