Bandi Bhagirath POCSO Case : పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ - హైకోర్టు ఉత్తర్వులు

Bandi Bhagirath POCSO Case : పోక్సో కేసులో ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని కోర్టు ఆదేశించింది.

Published on: Jul 9, 2026, 17:02:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bandi Bhagirath POCSO Case : తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసుపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం….
ఇవాళ తుది తీర్పును వెల్లడించింది.

పోక్సో కేసులో  బండి భగీరథ్ కు బెయిల్
పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్

రూ. లక్ష పూచీకత్తుతో బెయిల్

బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు…. కొన్ని కీలక షరతులను విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రూ. లక్ష రూపాయల సొంత పూచీకత్తుతో పాటు, అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల జామీను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ షరతులను పూర్తి చేసిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కేసు దర్యాప్తుకు సంబంధించిన అంశాలపై హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. ఈ కేసులో ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని…. కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘించవద్దని పేర్కొంది.

కేసు నేపథ్యం

ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా…. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కింది కోర్టులో బెయిల్ రాకపోవడంతో భగీరథ్ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More