TG Special TET Notification 2026 : ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 7 నుంచి దరఖాస్తులు

Telangana Special TET 2026 Notification : తెలంగాణలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్-2 నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 7 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 16 నుంచి 21 వరకు సీబీటీ పద్ధతిలో పరీక్షలు జరగనున్నాయి.

Published on: Oct 2, 2026, 14:07:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Telangana Special TET 2026 Notification : తెలంగాణలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ తదితర ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఇన్ సర్వీస్ టీచర్ల ప్రమోషన్లు, సర్వీసు అంశాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రెండో విడత ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG Special TET-2026-II) నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండో విడత టెట్ నోటిఫికేషన్
ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండో విడత టెట్ నోటిఫికేషన్

గతంలో నిర్వహించిన తొలి విడత ప్రత్యేక టెట్‌లో అర్హత సాధించలేకపోయిన వారికి, అలాగే పరీక్ష రాయడానికి అవకాశం పొందని ఉపాధ్యాయులకు ఈ రెండో విడత స్పెషల్ టెట్ మరో అవకాశంగా నిలవనుంది.

ముఖ్యమైన తేదీలు - షెడ్యూల్:

విద్యాశాఖ వెల్లడించిన ప్రకటన ప్రకారం స్పెషల్ టెట్-2 ఆన్‌లైన్ ప్రక్రియ షెడ్యూల్ క్రింది విధంగా ఉంటుంది….

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 7
  • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 16
  • పరీక్షల నిర్వహణ తేదీలు: నవంబర్ 16 నుంచి నవంబర్ 21 వరకు

ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించనున్నారు. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో వారికి కేటాయించిన సెంటర్లలో ఆన్‌లైన్ ద్వారా హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పణ, సమాచార బులెటిన్ మరియు పరీక్షల వివరణాత్మక సిలబస్ కొరకు ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in ను సందర్శించాలని అధికారులు సూచించారు.

భవిష్యత్తులో ఉపాధ్యాయుల పదోన్నతులు (ప్రమోషన్లు) మరియు స్కూల్ అసిస్టెంట్ హోదాల కేటాయింపులో టెట్ అర్హత అత్యంత కీలకమైన అంశంగా మారడంతో, ఈ రెండో విడత అవకాశాన్ని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ల ప్రమోషన్లు, ఇతర సర్వీసు అంశాల్లో టెట్ అర్హత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇకపై ఇన్-సర్వీస్ టీచర్ల కోసం క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తామని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నిర్ణయంలో భాగంగానే… ప్రస్తుతం రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More