...
...
Next Story

TG Special TET Notification : అక్టోబర్ 1న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ - నవంబర్‌లో పరీక్షలు!

TG Special TET Notification : తెలంగాణలోని ఇన్ సర్వీస్ టీచర్లకు మరో అప్డేట్ వచ్చేసింది. రెండో విడత టెట్ నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

Published on: Sep 27, 2026, 07:31:55 IST
Advertisement

TG Special TET Notification :తెలంగాణలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ తీపి కబురు అందించింది. ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన ఇన్-సర్వీస్ టీచర్ల టెట్ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించి…. నవంబర్ నెలలోనే(16 నుంచి 21 ) పరీక్షను పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఏడాదికి రెండుసార్లు….

ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ అప్డేట్
ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ అప్డేట్

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ల ప్రమోషన్లు, ఇతర సర్వీసు అంశాల్లో టెట్ అర్హత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇకపై ఇన్-సర్వీస్ టీచర్ల కోసం క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తామని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఈ నిర్ణయంతో వేలాది మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది.

గతంలో క్రమం తప్పకుండా టెట్ నిర్వహించకపోవడం వల్ల పదోన్నతుల సమయంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అర్హత సాధించాలనుకునే ఉపాధ్యాయులకు తగినన్ని అవకాశాలు లభిస్తాయి. అక్టోబర్ 1న వచ్చే నోటిఫికేషన్‌లో పరీక్ష తేదీలు, సిలబస్, దరఖాస్తు రుసుము, అర్హతల వివరాలను స్పష్టంగా వెల్లడించనున్నారు.

ఇక ఇటీవలే ఇన్ సర్వీస్ టీచర్ల కోసం విద్యాశాఖ నిర్వహించిన ప్రత్యేక టెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో15,749 (70.07 శాతం) మంది ఉపాధ్యాయులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఈనెల 8,9 తేదీల్లో మూడు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించగా… మొత్తం 22,477 మంది హాజరయ్యారు. వీరిలో 70.07 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks