Free Sewing Machine Scheme : ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం - దరఖాస్తు గడువు ఈనెల 30 వరకు పొడిగింపు
Telangana Indiramma Free Sewing Machine Scheme : మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించే 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం' దరఖాస్తు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
Telangana Indiramma Free Sewing Machine Scheme : తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం” దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి బీసీ మహిళకు ఈ పథకం ఫలాలు అందించాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకునే తుది గడువును 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన మహిళలకు ఇది సువర్ణ అవకాశమని అధికారులు వెల్లడించారు.

100 శాతం సబ్సిడీతో….
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,19,000 (1.19 లక్షలు) మంది అర్హులైన బీసీ మహిళలను ఎంపిక చేసి, వారికి 100 శాతం సబ్సిడీతో రూ. ఒక పైసా ఖర్చు లేకుండా ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు.
బీసీ కులాలకు చెందిన మహిళలు తమ ఇళ్ల నుంచే గౌరవప్రదంగా స్వయం ఉపాధి పొందే అవకాశాలను కల్పించడం, తద్వారా వారి కుటుంబాల నెలకు వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించడం ఈ స్కీమ్ ఉద్దేశ్యం, ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందజేయడం ద్వారా తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం మహిళలకు లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
అర్హత కలిగిన బీసీ మహిళలందరూ కాలయాపన చేయకుండా ఈ లభ్యమైన పొడిగింపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అభ్యర్థులు TGOBMMS అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను 2026 సెప్టెంబర్ 30 సాయంత్రంలోగా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం, లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతల వివరాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి బీసీ మహిళకు స్పష్టంగా చేరేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత సంక్షేమ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వార్డుల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, అర్హులైన వారందరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకునేలా సహాయం అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఇక కుటుంబ వార్షిక రాబడికి సంబంధించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక పరిమితులు విధించారు.
- గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక రాబడి రూ. 1.50 లక్షలకు మించకూడదు.
- పట్టణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక రాబడి రూ. 2.00 లక్షల లోపు ఉండాలి.
- ఆదాయ ధృవీకరణ పత్రం ఒక సంవత్సరం క్రితం పొందినదై ఉండాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

