Telangana : ఉచిత కుట్టు మిషన్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారా..? ఇవాళే చివరి తేదీ
TG Indiramma Sewing Machine Scheme : "ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం" కింద దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది.
రాష్ట్రంలోని పేద, నిరుద్యోగ మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించే ఉద్జేశ్యంతో ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం" కింద దరఖాస్తులను స్వీకరిస్తోంది. స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు వీలుగా అర్హులైన వారిని ఈ స్కీమ్ కింద ఎంపిక చేస్తారు.

అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన మహిళలు వెంటనే తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి నేడే (సెప్టెంబర్ 15, 2026) చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
అర్హతలు - ముఖ్య వివరాలు :
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఇక కుటుంబ వార్షిక రాబడికి సంబంధించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక పరిమితులు విధించారు.
- గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక రాబడి రూ. 1.50 లక్షలకు మించకూడదు.
- పట్టణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక రాబడి రూ. 2.00 లక్షల లోపు ఉండాలి.
- ఆదాయ ధృవీకరణ పత్రం ఒక సంవత్సరం క్రితం పొందినదై ఉండాలి.
మీ వద్ద ఉండాల్సిన పత్రాలు…
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం
అర్హత, ఆసక్తి ఉన్న మహిళలు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా TGOBMMS పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తిగల అభ్యర్థులు http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
పథకానికి సంబంధించి మరింత సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం సంబంధిత జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లేదా ఈడి బీసీ కార్పొరేషన్ (ED BC Corporation) అధికారులను నేరుగా సంప్రదించవచ్చు,
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

