OU Distance Admissions : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..?

OU Distance Admissions 2026 : ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యలో డిగ్రీ, పీజీ, అడ్వాన్స్ డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగించారు.

Published on: Sep 14, 2026, 12:02:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి దూర విద్య కేంద్రం (PGRRCDE) ద్వారా వివిధ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు మరో అప్డేట్ వచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా…. దరఖాస్తు చివరి తేదీని అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగించారు. ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు
ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు
  • పీజీ కోర్సులు : పీజీ విభాగంలో ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్) వంటి వృత్తిపరమైన కోర్సులతో పాటు ఎంఏ (MA) విభాగంలో హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, ఫిలాసఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • యూజీ (డిగ్రీ) కోర్సులు: డిగ్రీ స్థాయిలో బీఏ (BA), బీకామ్ జనరల్, బీబీఏ (BBA) కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా తత్సమాన విద్యా అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులు.
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా - సర్టిఫికేట్ కోర్సులు: ప్రత్యేక నైపుణ్యాల కోసం మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, వేద జ్యోతిష్యం తదితర విభిన్నమైన అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉన్నవారు వీటిలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సుల కాలపరిమితి:

  • అన్ని పీజీ కోర్సులు 4 సెమిస్టర్ల వ్యవధి (రెండు సంవత్సరాలు) కలిగి ఉంటాయి.
  • యూజీ (డిగ్రీ) కోర్సులు 6 సెమిస్టర్ల వ్యవధి (మూడు సంవత్సరాలు) ఉంటాయి.
  • యోగా సర్టిఫికేట్ కోర్సు వ్యవధి 2 సెమిస్టర్లు (ఒక సంవత్సరం) కాగా, మిగిలిన సర్టిఫికేట్ కోర్సుల వ్యవధి 6 నెలలుగా నిర్ణయించారు.

పీజీ కోర్సులకు సంబంధించి బోధనా మాధ్యమం ప్రధానంగా ఇంగ్లీష్‌లో ఉంటుంది. అయితే ఎంఏ తెలుగు, హిందీ, ఉర్దూ కోర్సులతో పాటు ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సు తెలుగు మాధ్యమంలో కూడా లభిస్తుంది. డిగ్రీ కోర్సులకు ఇంగ్లీష్, తెలుగు బోధనా మాధ్యమాలు అందుబాటులో ఉంటాయి. విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం…. ఏదైనా నిర్దిష్ట కోర్సును నిర్వహించాలంటే అందులో కనీసం 50 మంది విద్యార్థుల అడ్మిషన్లు తప్పనిసరిగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 09 అక్టోబర్ 2026
  • ఆన్‌లైన్ తరగతుల ప్రారంభం : 15 అక్టోబర్ 2026

అభ్యర్థులు కోర్సుల ఫీజు వివరాలు, సిలబస్, అర్హతలు మరియు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం PGRRCDE అధికారిక వెబ్‌సైట్ ( http://www.oucde.net/index.php ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More