...
...
Next Story

TG Inter Hall Ticket 2026 : తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లపై అప్డేట్ - ఎప్పుడు విడుదలంటే...?

తెలంగాణ ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. అయితే రేపు హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి.

Published on: Feb 17, 2026 11:14 AM IST
Advertisement

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఓవైపు పరీక్షల కోసం సమయం కూడా దగ్గరపడుతోంది. ఇప్పటికే సెంటర్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి.

హాల్ టికెట్లు ఎప్పుడంటే..?

ఇంటర్ హాల్ టికెట్లు (iamge source istock)
ఇంటర్ హాల్ టికెట్లు (iamge source istock)

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు ఇవాళ లేదా రేపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన నమూనా హాల్ టికెట్లను(ప్రివ్యూ) కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఏమైనా తప్పులు దొర్లితే సవరించుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించారు. పలువురు విద్యార్థులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు.

ఇక తుది హాల్ టికెట్లను ముందుగా ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. కాలేజీల లాగిన్ లో కూడా ఉంటాయి. ఆ తర్వాత… విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్ కు సెండ్ చేస్తారు. బోర్డు నుంచి వచ్చే లింక్ పై క్లిక్ చేసి నేరుగా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్‌ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారు. పేరు, ఫొటో, సబ్జెక్టుల్లో తప్పులు దొర్లితే కాలేజీ ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకునే అవకాశం ఉంది.

టీజీ ఇంటర్ పరీక్షలు - హాల్ టికెట్లు డౌన్లోడ్ ఎలా..?

  1. విద్యార్థులు https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో ఐపీఈ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ లింక్స్ డిస్ ప్లే అవుతాయి.
  3. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు టెన్త్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ కనిపిస్తుంది.
  4. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి హాల్ టికెట్ ను పొందొచ్చు.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe