TG Inter Hall Tickets 2026 : తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్!
తెలంగాణ ఇంటర్ పరీక్షల కోసం హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్( TGBIE ) టీజీ ఇంటర్ హాల్ టికెట్స్ 2026 విడుదల చేసింది. విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) మార్చి 2026కి హాజరయ్యే అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ https://tgbieht.cgg.gov.in/ నుండి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్‌తోనే ఎంటర్ కావాలి. అడ్మిట్ కార్డ్ లేకుండా ప్రవేశం లేదు.

అధికారిక పోర్టల్ నుండి ఇంటర్ 2026 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు విద్యార్థులు ఆయా కాలేజీల్లో ప్రిన్సిపల్ నుంచి హాల్ టికెట్లు తీసుకోవచ్చు. తల్లిదండ్రుల మొబైల్ నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి.
టీజీ ఇంటర్ హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
- tgbie.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- ఇంటర్ హాల్ టికెట్లు 2026 లింక్‌పై క్లిక్ చేయండి
- టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ 2026ని ఎంచుకోండి
- అవసరమైన లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
ఈ లింక్ క్లిక్ చేసి తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి
ఇవీ చూసుకోండి
డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు హాల్ టికెట్‌పై ముద్రించిన అన్ని వివరాలను ధృవీకరించాలి. అభ్యర్థి పేరు, రోల్ నంబర్ / రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్షా కేంద్రం పేరు, పూర్తి చిరునామా, ప్రతి పరీక్ష తేదీ మరియు సమయం, సబ్జెక్ట్ వారీగా పరీక్ష షెడ్యూల్, ముఖ్యమైన పరీక్ష-రోజు సూచనలు, కాలేజీ స్టాంప్ లేదా సీల్, ప్రిన్సిపాల్ సంతకం చూసుకోవాలి. ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే, వెంటనే మీ కాలేజీ అధికారులను లేదా TGBIEని సంప్రదించండి.
తరచూ అడిగే ప్రశ్నలు
ప్రశ్న : టీజీ ఇంటర్ హాల్ టికెట్ 2026 విడుదల అయిందా?
జవాబు : అవును. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం టీజీ ఇంటర్ హాల్ టికెట్ 2026ను విడుదల అయ్యాయి.
ప్రశ్న : టీజీ ఇంటర్ హాల్ టికెట్ 2026ను ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?
జవాబు : మీరు తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026
- 25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
- 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
- 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
- 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
- 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
- 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
- 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
- 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
- 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
- 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
- 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
- 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2
- 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
గమనిక : ఎక్కువమంది విద్యార్థులు ఓపెన్ చేస్తున్న కారణంగా వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తుతోంది. కావున కాసేపు ఆగి ప్రయత్నించండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


