...
...
Next Story

TG Inter Results 2026 : ఈనెల 12న తెలంగాణ ఇంటర్ ఫలితాలు - ఎలా చెక్ చేసుకోవాలంటే..?

Telangana Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈనెల 12వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ లోనూ చెక్ చేసుకోవచ్చు.

Published on: Apr 10, 2026 05:05 PM IST
Advertisement

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈనెల 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండియర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు బోర్డు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

టీజీ ఇంటర్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి..?

  1. తెలంగాణ ఇంటర్ రిజల్స్ట్ కోసం అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
  2. హోమ్ పేజీలోని ఇంటర్ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి.
  3. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
  4. సబ్మిట్ బటన్‌ మీద క్లిక్ చేయండి.
  5. అనంతరం ఫలితాలు మీ స్క్రీన్‌ మీద డిస్‌ప్లే అవుతాయి.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ లో ఇంటర్ ఫలితాలు:

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ ఫలితాలు హిందుస్తాన్ టైమ్స్( https://www.hindustantimes.com/ ) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ తో క్షణాల వ్యవధిలోనే మీ స్కోర్ డిస్ ప్లే అవుతుంది.

  • ముందుగా https://www.hindustantimes.com/telugu వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని ఇంటర్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  • విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe